sebi: పెట్టుబడిదారుల ప్రయోజనాలు కాపాడేందుకు సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) ఎప్పటికప్పుడు పలు చర్యలు తీసుకుంటూ ఉంటుంది. వాటిలో భాగంగా డీమ్యాట్ ఖాతాలకు నామినీలను జోడించాలని దాదాపు రెండేళ్ల క్రితమే ఆదేశించింది. అయితే అందుకు తుది గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. కాబట్టి ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

లావాదేవీలు స్తంభించడం తప్పదు:
ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్ హోల్డర్లు వారి ఖాతాలకు తప్పనిసరిగా నామినీలను ఎంచుకోవడం లేదా పూర్తిగా రద్దు చేసుకోవడం చేయాలని సెబీ ఆదేశించింది. 2021లోనే మార్కెట్ రెగ్యులేటరీ ఈ నిబంధన తీసుకొచ్చింది. అయితే ఈనెల 31తో ఇందుకు గడువు ముగియనుంది. ఒకవేళ ఈ పని పూర్తి చేయకపోతే, ఆయా అకౌంట్లకు సంబంధించిన లావాదేవీలు స్తంభింప చేయబడతాయి అని నియంత్రణ సంస్థ హెచ్చరించింది. ఈ గడువుకి ఇంకా 15 రోజులే ఉండటంతో.. పెట్టుబడిదారులు త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది.

ఇప్పటికే ఏడాదిపాటు పొడిగించిన గడువు:
నామినీ జోడింపు పూర్తిచేయని వారి అకౌంట్లను మార్చి 31 నుంచి స్తంభింపజేయనున్నట్లు సెబీ తన తాజా సర్క్యులర్ లో పేర్కొంది. గతేడాది మార్చి 31 వరకు మొదట సమయం ఇచ్చింది. కానీ వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ గడువును ఏడాదిపాటు పొడిగించింది. అయితే ఇప్పటికే నామినీని యాడ్ చేయడం పూర్తి చేసిన వారు మరోసారి చేయాల్సిన అవసరం లేదని సెబీ స్పష్టం చేసింది.

ఇవి తప్పనిసరి కాదు:
నామినీ ప్రక్రియను రెండంచెల భద్రతా ప్రమాణాలను వినియోగించాల్సి ఉంటుందని సెబీ పేర్కొంది. స్టాక్ బ్రోకర్, డిపాజిట్ పార్టిసిపెంట్స్ ద్వారా ఈ పని పూర్తి చేయాలని స్పష్టం చేస్తుంది. అయితే నామినీల ఇ-మెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్ వంటివి తప్పనిసరి కాదని పేర్కొంది. అక్టోబర్ 1 తరువాత ట్రేడింగ్ లేదా డీమ్యాట్ అకౌంట్ తీసుకుంటున్న వారు డిక్లరేషన్ ఫారం సమర్పిస్తే సరిపోతుందని తెలిపింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications