SEBI News: మార్కెట్ పార్టిసిపేషన్ పెంపునకు సెబీ కొత్త ఫ్రేమ్‌వర్క్.. మ్యూచువల్ ఫండ్స్, భాషలపై ఫోకస్
Sebi new proposals: ప్రస్తుతం అందుబాటులో ఉన్న పెట్టుబడి సాధనాల్లో రిటైల్ ఇన్వెస్టర్లను ఎక్కువగా ఆకర్షిస్తున్నది మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పడానికి ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పటికీ వాటిలో పెట్టుబడి కోసం వేలకు వేలు కావాలేమోనని భ్రమపడేవారు కూడా ఉన్నారు. కానీ అత్యంత తక్కువ ధరకే సిప్ అందుబాటులోకి తేవాలని, తద్వారా మరింత మందిని మార్కెట్ కార్యకలాపాల్లో భాగస్వాములు చేయాలని సెబీ ఆలోచిస్తోంది.
భారతీయ పెట్టుబడిదారులకు నెలకు 250 సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) అందుబాటులోకి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదని సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) ఛైర్‌పర్సన్ మధబి పూరి బుచ్ తెలిపారు. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ సహకారంతో ఈ ఫ్రేమ్‌వర్క్‌పై పని చేస్తున్నట్లు ఇటీవల జరిగిన CII కార్యక్రమంలో వెల్లడించారు.

'సాధ్యమైనంత మందిని మార్కెట్ కార్యకలాపాల్లోకి తీసుకురావాలనే సెబీ ఎజెండా చాలా ముఖ్యమైనది. సర్వీసింగ్ ఖర్చును తగ్గించడం ద్వారా కేవలం 250 SIPని ప్రవేశపెట్టడం అనేది ఆర్థిక ఉత్పత్తులను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చే మా ప్రణాళికలో ఓ కీలక ముందడుగు' అని బుచ్ పేర్కొన్నారు. మార్కెట్‌ను మరింత వృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు సాంకేతికతను చొప్పించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
దేశ ఆర్థిక వృద్ధిని నడిపించే జాతీయ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా వికసిత్ భారత్ ప్రయాణం వైపు మన ప్రయాణం వేగవంతం అవుతుందని సెబీ ఛైర్‌పర్సన్ వివరించారు. ప్రతి పౌరుడు వృద్ధి ప్రక్రియలో పాల్గొనేలా చూసుకోవడం ద్వారా సామాజిక చేరికను సులభతరం అవుతుందన్నారు. ఇందుకుగాను భాషా అవరోధాన్ని తొలగిస్తూ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పొందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అందుకే విస్తృత పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి IPO ప్రాస్పెక్టస్ 15-16 స్థానిక భాషలలో ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications