Mutual Funds: చాలా కాలంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా మంది నేరుగా మార్కెట్లలో ఈక్వీటీస్, డెరివేటివ్స్ ట్రేడింగ్ చేస్తుండగా.. కొందరు మాత్రం పరోక్షంగా మ్యూచువల్ ఫండ్ ఎంపికలను దీనికోసం వినియోగిస్తున్నారు. అయితే ఇందులో చిన్న పెట్టుబడిదారులను సైతం పార్టిసిపేట్ చేసేందుకు వీలు కల్పించాలని రెగ్యులేటర్ సెబీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఎస్ఐపీల రూపంలో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య క్రమంగా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దీంతో చిన్న ఇన్వెస్టర్ల చూపు సైతం ఈ పెట్టుబడి సాధనాలపై పడుతోంది. త్వరలో మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీలు స్టార్ట్ చేద్దాం అనుకునేవారికి పెద్ద శుభవార్త ఒకటి ఉంది. అవును త్వరలో కనీస ఎస్ఐపీ పెట్టుబడి మెుత్తాన్ని రూ.250కి తగ్గించనున్నట్లు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్‌పర్సన్ మధబి పూరి బుచ్ తెలిపారు. ప్రస్తుతం ఇది చాలా ఫండ్స్ లో కనీసం రూ.500గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రతిపాదించిన మైక్రో సిప్ కోట్లాది మంది చిన్న పెట్టుబడిదారుల ఆశలకు అండగా నిలుస్తుందని బుచ్ అభిప్రాయపడ్డారు.

మైక్రో-SIPలు అంటే ఏంటి?
మైక్రో-SIP అనేది సాంప్రదాయ క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళికలకు చౌకైన ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి సాంప్రదాయ ఎస్ఐపీలో కనీస పెట్టుబడి మెుత్తం రూ.500గా ఉంటుంది. అయితే చిన్న పెట్టుబడిదారులు, గ్రామీణ నివాసితులు, రోజువారీ వేతనం అందుకునే వ్యక్తులు తమ డబ్బును ఇన్వెస్ట్ చేసేందుకు తక్కువ మెుత్తంతో దీనిని పూర్తి చేసేందుకు మైక్రో సిప్ డిజైన్ చేయబడింది. ప్రస్తుతం జూలై డేటా ప్రకారం నెలవారీ మెుత్తం ఎస్ఐపీలు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో రూ.23,332 కోట్లుగా ఉన్నట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా వెల్లడించింది. ఎస్ఐపీలకు పెరుగుతున్న ఆదరణకు అనుగుణంగా తక్కువ మెుత్తంలో పెట్టుబడి అవకాశాలను పెంచాలని మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ తాజా ఆలోచనతో ముందుకు వచ్చింది.
దేశ అభివృద్ధిలో చిన్న పెట్టుబడిదారులు సైతం పాల్గొనటం ద్వారా మార్కెట్ పార్టిసిపెంట్లకు ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌కు పెంచాలని లక్ష్యంగా సెబీ చర్యలు చేపట్టింది. డిజిటలైజేషన్ దేశంలోని ప్రతి మూలకు చేరిన వేళ సెబీ దేశంలోని ప్రస్తుత డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఉపయోగించుకుని అతిచిన్న పెట్టుబడిదారులకు అందుబాటులో ఉండే పెట్టుబడి అవకాశాలను అందించాలని తాజా ప్రయత్నం ద్వారా చూస్తోంది. పెట్టుబడిదారులను కనెక్ట్ చేయడం, సేవలందించే ప్రక్రియను మరింత సమర్ధవంతంగా చేయడానికి సాంకేతికతను మరింత మెరుగ్గా ఉపయోగించాలని సెబీ చీఫ్ నొక్కి చెప్పారు. అయితే ఇప్పటికే మార్కెట్లో నావీ వంటి సంస్థలు నెలకు కనీసం రూ.10 పెట్టుబడితో ఎస్ఐపీలను ప్రారంభించేందుకు చిన్న పెట్టుబడిదారులకు అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications