F&O News: పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటుంది. డెరివేటివ్ మార్కెట్లో అంతకంతకూ పెరుగుతూ పోతున్న రిటైలర్స్ పార్టిసిపేషన్‌ను సాధ్యమైనంత మేర తగ్గించేందుకు నడుం బిగించింది. ఈ మేరకు అగ్రెసివ్‌గా ముంందుకు వెళ్లాలని నిర్ణయించింది.
F&O సెగ్మెంట్ పై సెబీ ఛైర్ పర్సన్ మధాబి పూరీ బుచ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. నిపుణుల కమిటీ సిఫారసు చేస్తే డెరివేటివ్ ప్రొడక్ట్స్‌ను మార్కెట్స్ నుంచి పూర్తిగా తొలగించేందుకు సైతం తాము సిద్ధమని ప్రకటించారు. ఈ మేరకు జూన్ 27న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ప్రసంగించారు. ఈ తరహా రెగ్యులేటరీ ప్రమాదాన్ని మార్కెట్ అర్థం చేసుకుంటుందని భావిస్తున్నట్లు చెప్పారు.

వీక్లీ ఆప్షన్స్ సహా ఎక్స్పైరీ రోజున ఎక్కువగా ట్రేడింగ్ జరుగుతుండటాన్ని సెబీ గమనించినట్లు బుచ్ తెలిపారు. ఇది పూర్తిగా స్పెక్యులేషన్ అని ఏమాత్రం హెడ్జింగ్ కోణం కనిపించలేదన్నారు. ప్రత్యేకించి ఈ స్పెక్యులేటివ్ కార్యకలాపాల కోసం ప్రజలు విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు వెల్లడించారు. పలువురు తమ ఇళ్లను సైతం కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారుల రక్షణ కోసం ఏమి చేయాలి అనే ప్రశ్న తలెత్తినట్లు చెప్పారు.
ఇదే తరహా ట్రేడింగ్ బిహేవియర్ కొనసాగితే డెరివేటివ్ ఉత్పత్తులను నిలిపివేయడానికి రెగ్యులేటర్ సిద్ధంగా ఉందా అన్న ప్రశ్నకు ఆమె క్లియర్ గా సమాధానం ఇచ్చారు. డేటా మరియు లాజిక్ అందుకు అనుగుణంగా ఉంటే, అలా చేయడంలో ఎలాంటి సందేహం లేదని తేల్చి చెప్పారు. రెగ్యులేటరీ రిస్క్స్ గురించి జెరోధా వ్యవస్థాపకులు నితిన్ కామత్ వ్యాఖ్యలను ప్రస్తావించగా.. అవి వ్యాపారంలో భాగమైన వాస్తవమని, ఏ పెట్టుబడిదారుడైనా దాని గురించి అవగాహన కలిగి ఉండాలన్నారుు.


Click it and Unblock the Notifications