SEBI News: యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలు అధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న వేళ చాలా మంది ఇఫ్లుయెన్సర్లు రోజురోజూ పుడుతూనే ఉన్నారు. వాళ్లకు తెలిసినదాన్ని ఫాలోవర్లతో పంచుకుంటున్నారు.
అయితే ఆర్థిక పరమైన అంశాల్లో పూర్తిగా అవగాహన లేకుండానే కొంత మంది చేస్తున్న వీడియోలు రిటైల్, చిన్న పెట్టుబడిదారులను నష్టాల్లోకి నెడుతున్నాయి. ఇలాంటి వాటిని అడ్డుకోవాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నిర్ణయించింది. తాము వాక్ స్వాతంత్య్రానికి గౌరవిస్తామని.. అయితే అది గీత దాటకూడదని సెబీ చైర్‌పర్సన్ మధాబి పూరీ బుచ్ గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2023లో ఫిన్‌ఫ్లూయెన్సర్లకు తేల్చి చెప్పారు.

అలాగే తాము నిజమైన విద్యను గౌరవిస్తామని బుచ్ వెల్లడించారు. వారి ప్రవర్తన గీతదాటి అమాయకు ఇన్వెస్టర్లను ప్రలోభపెట్టడం, ఉచ్చులో ఇరికించటం, మోసం చేయటం వంటి వాటికి పాల్పడంతోనే తమకు సమస్య అని ఆమె అన్నారు. ఫిన్‌ఫ్లుయెన్సర్లు తమ నియమాలను పాటించకపోతే, మా నిబంధనలను అనుసరించే వ్యక్తులు మీతో అనుబంధించబడలేరని ఆమె తెలిపారు.
సాధారణంగా ఫిన్‌ఫ్లూన్సర్లు సోషల్ మీడియా లేదా డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సెక్యూరిటీస్, పర్సనల్ ఫైనాన్స్, బ్యాంకింగ్ ఉత్పత్తులు, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్, క్రిప్టో కరెన్సీలు, ట్రేడింగ్ వంటి ఇతర పెట్టుబడి అంశాలపై సలహాలను అందిస్తుంటారు. వీరు తమ వీడియోలతో తమ ఫాలోవర్లను ప్రభావితం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ల ట్రేడింగ్ ప్రమోట్ చేసే చాలా మంది ఫిన్‌ఫ్లూన్సర్లు ఆశ్చర్యకరమైన రాబడులను అందిస్తామంటూ చిప్స్ ఇస్తామంటూ ఎలాంటి రెగ్యులేటరీ లైసెన్స్ లేకుండా సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న వీడియోలు ఇటీవల చాలా వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications