IPO Fraud: ఐపీవో మోసాలపై సెబీ సీరియస్.. ఆ మూడు సంస్థలపై కొనసాగుతున్న దర్యాప్తు..
IPO Scam: 2023 నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఐపీవోల్లో 95 శాతం మేర ఇన్వెస్టర్లకు సానుకూల రాబడులను అందించాయి. చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఐపీవోలుగా వచ్చిన కంపెనీలు నిరాశకు గురిచేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఐపీవోల వెనుక జరుగుతున్న మోసాలు బయటపడినట్లు తెలుస్తోంది.
క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ అందుకున్న సబ్‌స్క్రిప్షన్‌ల సంఖ్యను పెంచిందనే ఆరోపణలపై మూడు ఐపీవోలను మాధబి పూరి బుచ్ పరిశీలిస్తున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. అయితే ఈ క్రమంలో సదరు కంపెనీల పేర్లు కానీ, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల పేర్లను కానీ ఆమె బయటకు ప్రకటించలేదు. క్యాపిటల్ మార్కెట్ వాచ్‌డాగ్ ఇటువంటి దుష్ప్రవర్తనలను అరికట్టడానికి చర్యలపై పనిచేస్తోందని అన్నారు.

గడచిన కొన్ని నెలలుగా మార్కెట్లోకి ప్రవేశిస్తున్న కంపెనీల లిస్ట్ పెరుగుతున్న క్రమంలో మాధబి చేసిన కామెంట్స్ కీలకంగా మారాయి. వాస్తవానికి గడచిన ఏడాదిలో సుమారు 175 ఎస్ఎమ్ఈ కంపెనీల ఐపీవోలు మార్కెట్లోకి అరంగేట్రం చేయగా.. దాదాపు 55 మెయిన్ బోర్డ్ కంపెనీల ఐపీవోలు దలాల్ స్ట్రీట్‌లో కోలాహలం చేశాయి. వీటిలో చాలా సంస్థలు చారిత్రాత్మక రికార్డు ధరలకు జాబితా చేయబడ్డాయి. ఈ క్రమంలో ఎస్ఎమ్ఈ సంస్థలు మార్కెట్ల నుంచి దాదాపు రూ.5,000 కోట్లను మూలధన అవసరాల కోసం విజయవంతంగా సమీకరించాయి.
అయితే 2022లో 40 IPOల ద్వారా సేకరించిన రూ.59,303 కోట్లతో పోలిస్తే, IPOల ద్వారా మెయిన్‌బోర్డ్ ప్లేయర్‌ల నిధుల సేకరణ 2023లో 17 శాతం తగ్గి 57 కంపెనీల ద్వారా రూ.49,434 కోట్లకు పడిపోయిందని ప్రైమ్ డేటాబేస్ డేటా సూచించింది. 2022లో మార్కెట్లోకి వచ్చి నిరాశకు గురిచేసిన ఐపీవోగా ఎల్ఐసీ ఇన్వెస్టర్లకు చేదు అనుభవాన్ని సైతం మిగిల్చింది. ఈ అతిపెద్ద ఐపీవో నుంది భారత ప్రభుత్వం ఏకంగా రూ.21,000 కోట్లను పెట్టుబడిదారుల నుంచి సమీకరించింది. IPOల హడావిడి మధ్య ప్రాథమిక మార్కెట్ కార్యకలాపాల్లో ముఖ్యంగా SME స్థలంల్లో అధిక వాల్యుయేషన్‌లు, కొన్ని దుష్ప్రవర్తనలపై బుచ్ ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications