250 SIP: కరోనా కాలం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లలో రిటైల్ పెట్టుబడిదారుల పార్టిసిపేషన్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ప్రజలు ఈక్విటీ మార్కెట్ల నుంచి సెకండరీ ఇన్కమ్ గురించి ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. వీరు విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్లను విడిచిపెడుతున్నప్పుడు కుషన్ గా కూడా వ్యవహరిస్తున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ చీఫ్ మాధబీ పూరీబుచ్ దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రజలు పెట్టుబడిపెట్టడానికి మ్యూచువల్ ఫండ్స్ మార్గం ద్వారా తక్కువ కనీస మెుత్తంలో తీసుకురావాలని చూస్తున్నట్లు వెల్లడించారు. కానీ ఇప్పుడు దీనికి అనుగుణంగా పేటీఎం ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ రూ.250 కనీస సిప్ పెట్టుబడికి వీలుగా ప్రత్యేక స్కీమ్ తీసుకురావటంపై బుచ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ చర్య వల్ల ప్రతి కొడుకు కూతురు పెట్టుబడిపెట్టడానికి అవకాశం కల్పిస్తుందని అన్నారు.

చిన్న SIP స్కీమ్స్ అమలుపై ఉన్న ఆందోళనల గురించి సెబీ చీఫ్ బుచ్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని చాలా సున్నితమైన రీతిలో రూపొందించినట్లు హామీ ఇచ్చారు. దీనిని క్రమంగా పరిశ్రమలోని వివిధ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు అమలుకు అందిపుచ్చుకుంటాయని సానుకూలతతో ఉన్నట్లు బుచ్ పేర్కొన్నారు. కొన్ని రోజుల కిందట 'JanNivesh SIP' పథకాన్ని కేవలం రూ.250 నెలవారీ పెట్టుబడితో తీసుకురావటం తన కలగా ఆమె పేర్కొన్నారు. ఇది దేశంలో అధిక సంఖ్యలో ప్రజలను స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడానికి ఒక మార్గంగా మారుతుందని అన్నారు.
JanNivesh SIP ప్రయోజనాలు..?
చిన్న నెలవారీ క్రమ పద్ధతిలో పెట్టుబడి పెట్టాలని భావిస్తున్న ఇన్వెస్టర్ల సౌలభ్యం కోసం తాజాగా పేమెంట్స్ దిగ్గజం పేటీఎం ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీతో జతకట్టింది. రెండు సంయుక్తంగా చిన్న ఇన్వెస్టర్ల కోసం రూ.250 SIP మ్యూచువల్ ఫండ్ పథకమైన జన్‌నివేష్ లాంచ్ చేశాయి. ఇది మ్యూచువల్ ఫండ్ మార్కెట్లో ఎక్కువ మంది పెట్టుబడిదారులను ఆకట్టుకోవటానికి దోహదపడుతుందని రెండు సంస్థలు భావిస్తున్నాయి.
భారతదేశంలో సామాన్య ప్రజలకు సైతం మ్యూచువల్ పెట్టుబడులను చేరువచేటం కోసం భారత ప్రభుత్వం తీసుకొస్తున్న వికసిత్ భారత్ కింద ప్రజలు తమ భవిష్యత్తు కోసం పెట్టుబడులను కొనసాగించటానికి పేటీఎం జన్ నివేష్ రూ.250 SIPని తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ఈ చొరవను సెబీ చైర్‌పర్సన్ మాధబి పూరి బుచ్, SBI చైర్మన్ శెట్టి ఈరోజు ప్రారంభించారు. దీని కింద పెట్టుబడిదారులు ఇకపై కేవలం రూ.250 కనీస పెట్టుబడితో తమ సిప్ ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించటానికి వీలు కల్పిస్తూ ప్రజలకు ఆర్థిక వృద్ధిని సాధించటంలో సహాయపడుతుందని పేటీఎం పేర్కొంది.
కొత్తగా తీసుకొచ్చిన జన్ నివేష్ స్కీమ్ పై పేటీఎం సీఈవో, వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ వెల్లడించారు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా దేశంలోని కోటి మంది పెట్టుబడిదారులకు ప్రస్తుతం చేరువకావాలని పేమెంట్స్ దిగ్గజం పేటీఎం పేర్కొంది. భవిష్యత్తులో వీరి సంఖ్య దాదాపు 4 కోట్లకు చేరుకోవచ్చని ఆయన తన అంచనాలను పేర్కొన్నారు. తమ ప్రస్తుత స్కీమ్ లక్షల మంది భారతీయులకు తక్కువ మెుత్తంతో పెట్టుబడి మార్గాలను అందిస్తుందని హర్షం వ్యక్తం చేశారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications