SEBI new rules: స్టాక్‌ మార్కెట్ ఇన్వెస్టర్లకు అదిరిపోయే న్యూస్.. ఇకపై ఏరోజు సెటిల్‌మెంట్ ఆరోజే..

Trade Settlement: పెట్టుబడిదారుల అవసరాలకు అనుగుణంగా సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఎప్పటికప్పుడు తన నిబంధనలను అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఇటీవల T+2గా ఉన్న సెటిల్మెంట్ సైకిల్‌ను T+1కి మార్చింది. రానున్న రోజుల్లో దీన్ని మరింత కుదిస్తామని అప్పుడే ప్రకటించింది. కాగా తాజాగా సెబీ ఛైర్‌పర్సన్ ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఈ నెలాఖరు నుంచి స్టాక్ మార్కెట్లో జరగబోయే మార్పులు గురించి ప్రస్తావించారు.

క్యాష్ సెగ్మెంట్లో సెటిల్మెంట్ సైకిల్ ఐచ్ఛిక ప్రాతిపదికన T+0కు మార్చుతున్నట్లు సెబీ ఛైర్ పర్సన్ మాధబి పురి బచ్‌ ప్రకటించారు. ఈ నిర్ణయం మార్చి 28 నుంచి అమల్లోకి రానున్నట్లు చెప్పారు. అదే విధంగా మార్చి 2025 నాటికి తక్షణ సెటిల్మెంట్ అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. శుక్రవారం మార్కెట్ రెగ్యులేటర్ బోర్డు సమావేశం జరగనుండగా.. అందులో T+0 సెటిల్మెంట్ కోసం కొత్త ఫ్రేమ్ వర్క్ ని ఆమోదించవచ్చని తెలుస్తోంది.

SEBI chairperson announcement of moving markets to T 0 cycle

ప్రస్తుతం భారతీయ మార్కెట్లు T+1 సెటిల్మెంట్ విధానంలో పని చేస్తున్నాయి. అయితే ఇప్పటికీ గ్లోబల్ మార్కెట్లు T+2 సైకిల్ ఫాలో అవుతున్నాయి. ఇదే విషయంపై ఇటీవల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు లిక్విడేషన్ సమస్యల మీద ఆందోళన వ్యక్తం చేశారు. US మార్కెట్లు T+1 సైకిల్‌కు మారేంత వరకు వేచి చూడాలని కోరారు. అయితే వారితో పలు దఫాల వివరణాత్మక చర్చల అనంతరం.. ఇబ్బందులను వారికి వివరించి సెబీ ఛైర్‌ పర్సన్ వెల్లడించారు.

ఇన్వెస్ట్‌మెంట్ సెటిల్మెంట్ సహా టోకనైజేషన్ ద్వారా పనిచేసే క్రిప్టో కరెన్సీ మార్కెట్ల పట్ల మధుమాధవి పురి బీచ్ ఆందోళన వ్యక్తం చేశారు. వాటి నుంచి వస్తున్న సవాళ్లను ఆమె హైలెట్ చేశారు. అత్యంత నియంత్రణతో ఉన్న మా మార్కెట్లు ప్రపంచంతో పోటీ పడలేకపోతే FPIలు జారుకునే ప్రమాదం ఉందన్నారు. తక్షణమే స్పందించి లిక్విడేషన్ సమస్యను పరిష్కరించకపోతే మా మ్యూచువల్ ఫండ్స్ మరియు FPIలపై తీవ్ర ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+