Karvy: మార్కెట్ లో ట్రేడ్ చేసేవారు తమ సంపదను ఆయా కంపెనీల్లో పెట్టుబడి పెడుతూ, మంచి రాబడిని సంపాదించడానికి చూస్తుంటారు. ఈ క్రమంలో ఇన్వెస్టర్స్‌కు, ఎక్స్ఛేంజీలకు మధ్య స్టాక్ బ్రోకర్లు వారధిగా ఉంటారు. కానీ వారే అక్రమాలకు పాల్పడితే పూర్తి మార్కెట్ పైనే పెట్టుబడిదారులు నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది. కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది.
ఖాతాదారుల నిధులను వారి సమ్మతి లేకుండా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించిన కార్వీ స్టాక్ బ్రోకింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ రద్దు చేసింది. ఖాతాదారులకు తెలియకుండా వారి డీమ్యాట్ ఖాతాల్లో ఉన్న సెక్యూరిటీలను తాకట్టు పెట్టినందుకు నెల క్రితం మార్కెట్ నుంచి ఆ సంస్థను నిషేధించింది. తమకు అప్పగించిన పవర్ ఆఫ్ అటార్నీని దుర్వినియోగం చేసినందుకు 21 కోట్ల జరిమానా సైతం విధించింది.

రిజిస్ట్రేషన్ రద్దు చేస్తున్నప్పటికీ స్టాక్ బ్రోకర్‌గా పూర్తి చేయాల్సిన బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని మార్కెట్ రెగ్యులేటర్ కార్వీకి తెలిపింది. ఫీజులు మరియు ఇతర బకాయిలు సైతం చెల్లించాల్సిందేనని వెల్లడించింది. డీమ్యాట్ ఖాతాల ద్వారా మోసానికి పాల్పడినట్లు గుర్తించిన సంవత్సరాల తర్వాత కార్వీని డిఫాల్టర్‌గా గుర్తించి భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలు బహిష్కరించాయి.
కార్వీ తన ఖాతాదారుల నిధులను చట్టవిరుద్ధంగా తాకట్టు పెట్టడమే కాకుండా.. తద్వారా సేకరించిన డబ్బును తన రియల్ ఎస్టేట్ విభాగంలోకి మళ్లించింది. ఈ స్టాక్ బ్రోకింగ్ సంస్థ కార్వీ క్యాపిటల్ వైపు మళ్లించిన 1,400 కోట్లకు పైగా డబ్బును తిరిగి చెల్లించాలని కూడా రెండు సంస్థలను సెబీ ఆదేశించింది.


Click it and Unblock the Notifications