Quant Funds News: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. డైరెక్టుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసి నష్టాలు మూటగట్టుకునే కంటే ఇదే బెటర్ అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. రిస్క్ తక్కువతో పాటు లాంగ్ టర్మ్‌లో భారీ వృద్ధి సాధించే అవకాశం ఉండటంతో జనం ఎగబడుతున్నారు. అయితే ఇన్వెస్ట్‌మెంట్ మొత్తాన్ని మేనేజ్ చేసే ఫండ్ హౌస్‌లపై ఒక్కోసారి పలు ఆరోపణలు వస్తుంటాయి.
93 వేల కోట్ల ఆస్తుల నిర్వహణతో క్వాంట్ మ్యూచువల్ ఫండ్ దేశంలోని పెద్ద ఫండ్ హౌస్‌లలో ఒకటిగా కొనసాగుతోంది. ఫ్రంట్ రన్నింగ్ అనుమానాలతో క్యాపిటల్ మార్కెట్స్ నియంత్రణ సంస్థ సెబీ సెర్చ్ మరియు సీజర్ ఆపరేషన్‌లను నిర్వహించినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. ముంబై మరియు హైదరాబాద్‌లోలలో ఇవి జరిగినట్లు సమాచారం. దీంతో క్వాంట్ మ్యూచువల్ ఫండ్‌కు చెందిన స్మాల్‌క్యాప్ హోల్డింగ్‌లు ఈరోజు ఒత్తిడిలో కొనసాగవచ్చని అంచనా.

మ్యూచువల్ ఫండ్స్‌లో ఫ్రంట్-రన్నింగ్ అనేది ఒక చట్టవిరుద్ధమైన పద్ధతి. ఇందులో ఫండ్ హౌస్ ఇన్వెస్ట్ చేయనున్నట్లు పెట్టిన భారీ ఆర్డర్ సమాచారంతో బ్రోకర్ లేదా డీలర్ ఆయా స్టాక్స్‌ని కొనుగోలు చేస్తుంటారు. అంటే మ్యూచువల్ ఫండ్ హౌస్ కొనుగోలు చేయనున్న స్టాక్స్ సమాచారాన్ని ముందుగా తెలుసుకున్న బ్రోకర్.. తన వ్యక్తిగత లాభం కోసం అవే స్టాక్స్‌లో లావాదేవీలు నిర్వహిస్తారు. తద్వారా ధర పెరిగిన తర్వాత వాటిని తిరిగి విక్రయించి లాభం పొందుతారు.
ఇదే మాదిరిగా మ్యూచువల్ ఫండ్స్ హౌసెస్ తమ స్టాక్స్ విక్రయ సమయంలోనూ ఆర్డర్ ఎగ్జిక్యూషన్‌కు ముందే ఆయా కంపెనీల షేర్లను బ్రోకర్ షార్ట్-సెల్ చేస్తారు. అయితే ఎటువంటి అనుమానం రాకుండా ఈ తరహా లావాదేవీలను తన సొంత ఖాతాల ద్వారా కాకుండా సహచరుల అకౌంట్స్ నుంచి బ్రోకర్ లేదా డీలర్ నిర్వహిస్తారు. అంతర్గత సమాచారాన్ని దోపిడీ చేయడంతో పాటు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారుల ప్రయోజనాలకు ఇది దెబ్బతీస్తుంది కాబట్టి సెబీ ఈ తరహా ప్రాక్టీస్‌పై చర్యలు తీసుకుంటుంది.
గత మూడు సంవత్సరాలలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన మ్యూచువల్ ఫండ్ హౌస్‌లలో క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ఒకటి. జనవరి 2020లో దీని AUM 258 కోట్లు ఉండగా.. జూన్ 2024 నాటికి అదికాస్తా 90 వేల కోట్లకు పెరిగింది. ఒక్క మే నెలలోనే ఈ ఫండ్‌లో నికర ఇన్‌ఫ్లో 43 శాతం స్మాల్ క్యాప్ ఫండ్స్‌లోకి వచ్చింది. ప్రస్తుత ఆరోపణల నేపథ్యంలో దీనికి సంబంధించిన స్మాల్ మరియు మిడ్ క్యాప్ ఫండ్స్ దాదాపు 10 శాతం చొప్పున రిలయన్స్‌లో పెట్టుబడులు పెట్టడంతో లిక్విడేషన్ అనేది అసలు సమస్యే కాదని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ తరహా ఉల్లంఘనలు బయటపడటం ఇదేమీ కొత్త కాదు. గతేడాది వీరేష్ జోషి మరియు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఫ్రంట్-రన్నింగ్ కేసులోనూ 20 మందిని సెక్యూరిటీల మార్కెట్ నుంచి సెబీ నిషేధించింది. సదరు కార్యకలాపాల ద్వారా వారు పొందిన 30.55 కోట్ల తప్పుడు లాభాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ తరహా ప్రాక్టీస్‌ల పెరుగుతుండటంతో. డీలర్లు మరియు ఫండ్ మేనేజర్ల అన్ని కమ్యూనికేషన్లను రికార్డు చేయడం తప్పనిసరి చేస్తూ సెబీ నిర్ణయం తీసుకుంది.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications