SEBI: Zee-Sony కంపెనీల విలీనానికి సంబంధించిన విషయంలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. జీ యాజమాన్యం ఎస్సెల్ గ్రూప్ చీఫ్ సుభాష్ చంద్ర, జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో పునీత్ గోయెంకాపై సెబీ నిషేధం విధించింది.
సెబీ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు వీరిద్దరూ జీకి సంబంధించిన ఏదైనా లిస్టెడ్ కంపెనీలు లేదా దాని అనుబంధ సంస్థలలో డైరెక్టర్ లేదా మరే ఇతర కీలకమైన మేనేజీరియల్ పదవులు కలిగి ఉండరాదని మార్కెట్ రెగ్యులేటర్ ప్రకటించింది. వీరిద్దరూ నిధులను స్వాహా చేసేందుకు తమ అధికార హోదాను దుర్వినియోగం చేసినట్లు క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆరోపించింది.

ప్రస్తుతం జీలో ప్రమోటర్ కుటుంబానికి కేవలం 3.99 శాతం వాటా మాత్రమే ఉంది. అయినప్పటికీ జీ వ్యాపార వ్యవహారాలకు సుభాష్ చంద్ర, పునీత్ గోయెంకాలు నాయకత్వం వహిస్తున్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నప్పుడు సదురు వ్యక్తులను ఏదైనా లిస్టెడ్ కంపెనీ లేదా దాని అనుబంధ సంస్థలలో డైరెక్టర్/KMPగా కొనసాగడం ఆ కంపెనీల ప్రయోజనాలకు.. ముఖ్యంగా ఇన్వెస్టర్లకు హాని కలిగించే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ క్రమంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చినట్లు సెబీ పూర్తికాల సభ్యుడు అశ్వనీ భాటియా చెప్పారు.
జీ సంస్థ ఆస్తులను, ఇతర ఎస్సెల్ గ్రూప్ లిస్టెడ్ ఎంటిటీలను.. తమ ఆధీనంలోని అసోసియేట్ సంస్థల ప్రయోజనాల కోసం తండ్రి కొడుకులు విరివిగా వినియోగించినట్లు సెబీ ఆరోపిస్తోంది. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఏప్రిల్‌లో కంపెనీ నుంచి నిధులను స్వాహా చేసినందుకు, ఇతర నిబంధనలను ఉల్లంఘించినందుకు SGRL, దాని మాజీ ఛైర్మన్ అమిత్ గోయెంకా, ప్రమోటర్ జయనీర్ ఇన్‌ఫ్రాపవర్ అండ్ మల్టీవెంచర్స్, మరో ఐదుగురికి వ్యతిరేకంగా సెబీ మధ్యంతర ఆర్డర్-కమ్-షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. ఇదే విషయాన్ని రుణదాతలు NCLTకి తీసుకువెళ్లారు.


Click it and Unblock the Notifications