IIFL సెక్యూరిటీస్‌పై సెబీ నిషేధం.. రెండేళ్లపాటు క్లయింట్ ఆన్‌బోర్డింగ్ కు నో ఛాన్స్!
IIFL: పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడేందుకు సెబీ మరోసారి రంగంలోకి దిగింది. క్లయింట్ల నిధులను దుర్వినియోగం చేసినందుకు కార్వీ సంస్థపై ఇటీవల చర్యలు చేపట్టింది. తాజాగా ఇదే ఆరోపణల నేపథ్యంలో బ్రోకరేజ్ సంస్థ IIFL సెక్యూరిటీలపై కొరడా ఝళిపించింది. కొత్త ఖాతాదారులను ఆన్‌బోర్డ్ చేయకుండా రెండేళ్లపాటు నిషేధించింది.
ఏప్రిల్ 2011 నుంచి జనవరి 2017 మధ్య IIFL ఖాతా పుస్తకాలను క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ అనేకసార్లు తనిఖీ చేసిన తర్వాత ఈ ఆదేశాలు జారీ చేసింది. తన యాజమాన్య ట్రేడ్‌ల సెటిల్మెంట్ కోసం క్లయింట్ల నిధులను దుర్వినియోగం చేసిందని సెబీ తన విచారణలో తేలింది. అలాగే డెబిట్ బ్యాలెన్స్, క్లయింట్‌ల ట్రేడ్‌లు విషయంలోనూ ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించింది.

"IIFLకు సంబంధించిన పూర్తి డేటాను పరిగణనలోకి తీసుకుంటే, క్రెడిట్ క్లయింట్ల సొమ్మును దుర్వినియోగం చేసింది. తన స్వంత యాజమాన్య ట్రేడ్‌లకు నిధులు సమకూర్చింది. తద్వారా సెబీ 1993 సర్క్యులర్‌లోని నిబంధనలను ఉల్లంఘించింది" అని సెబీ సభ్యులు SK మొహంతి తన 64 పేజీల తుది ఉత్తర్వులో పేర్కొన్నారు.

ఏప్రిల్ 2011 నుంచి జూన్ 2014 మధ్య 42 ట్రేడింగ్ రోజులలో.. తన స్వంత లావాదేవీలకు నిధుల కోసం క్రెడిట్ బ్యాలెన్స్‌లను కలిగిన ఖాతాదారుల నిధులను కంపెనీ ఉపయోగించింది. సెబీ ప్రవర్తనా నియమావళికి నమోదిత బ్రోకర్‌లు అందరూ కట్టుబడి ఉండాలి. అయితే ఈ నిబంధనలను కూడా బ్రోకింగ్ సంస్థ ఉల్లంఘించినట్లు తేలింది.


Click it and Unblock the Notifications