Urban Company మరియు boAtతో 2025లో IPO హవా – స్టాక్ మార్కెట్ హాట్‌గా మారనుంది
పాపులర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ "boAt" ఇప్పుడు కొత్త అడుగు వేస్తుంది. boAt యొక్క మాతృ కంపెనీ ఇమాజిన్ మార్కెటింగ్ యొక్క ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ను మార్కెట్ రెగ్యులేటర్ SEBI ఆమోదించింది, SEBI విడుదల చేసిన డాక్యుమెంట్ ప్రకారం.

boAt, హెడ్ఫోన్స్, స్మార్ట్ వాచీలు మరియు ఇతర గ్యాడ్జెట్లు బ్రాండ్. ఏప్రిల్‌లో ఈ కంపెనీ "గోప్యంగా IPO ఫైలింగ్" చేసింది. వార్బర్గ్ పింకస్ మద్దతు ఉన్న ఇమాజిన్ మార్కెటింగ్ ఈ IPO ద్వారా "రూ.13,000 కోట్ల విలువ" లక్ష్యంగా పెట్టుకుంది.
ఇది కంపెనీ రెండవసారి పబ్లిక్ అయ్యే ప్రయత్నం చేసింది. 2022లో రూ.2,000 కోట్ల IPO కోసం మొదట ఫైలింగ్ చేసింది అందులో రూ. 900 కోట్లు కొత్త షేర్ల ద్వారా, రూ. 1,100 కోట్లు ఇప్పటికే ఉన్న వాటాదారులు OFS (Offer For Sale) ద్వారా రైజ్ చేయాలని భావించింది.
2013లో అమన్ గుప్తా మరియు సమీర్ మెహతా స్థాపించిన ఇమాజిన్ మార్కెటింగ్, ఆడియో గేర్, స్మార్ట్ వేర్, పర్సనల్ గ్రూమింగ్ ప్రోడక్ట్స్, మొబైల్ యాక్ససరీలు వంటి విభిన్న ఉత్పత్తులు మార్కెట్‌లో అందిస్తోంది.
ఈసారి " కాన్ఫిడెంటియల్ ప్రీ-ఫైలింగ్ మార్గం" ను ఎంచుకోవడం, భారత కంపెనీలలో కొత్త ట్రెండ్. Swiggy, విశాల్ మెగా మార్ట్ వంటి పెద్ద కంపెనీలు కూడా ఇదే రూట్ ద్వారా IPO ని విజయవంతంగా తీసుకున్నాయి.
మార్కెట్ నిపుణులు చెబుతున్నది ఎమిటంటే ఈ రూట్ కంపెనీలకు ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. సాధారణ IPOలో SEBI ఆమోదం తర్వాత 12 నెలల్లో మాత్రమే IPO ప్రారంభించాలి, కానీ కాన్ఫిడెంటియల్ ప్రీ-ఫైలింగ్ మార్గం ద్వారా 18 నెలల్లో కూడా IPO చేసుకోవచ్చు. అలాగే, ప్రైమరీ ఇష్యూ సైజ్ను 50% వరకు అడ్జస్ట్ చేసుకోవడం కూడా సాధ్యం.
boAt తో పాటు "12 ఇతర కంపెనీలు" కూడా IPO కోసం SEBI నుండి ఆమోదం పొందాయి. వాటిలో ముఖ్యమైనది "Urban Company", మిగతా కంపెనీలు:
జునిపర్ గ్రీన్ ఎనర్జీ
* ఆల్కెమ్ లైఫ్‌సైన్స్
* ఓమ్నిటెక్ ఇంజనీరింగ్
* KSH ఇంటర్నేషనల్
* రవి ఇన్‌ఫ్రాబిల్డ్ ప్రాజెక్ట్స్
* మౌరి టెక్
* ప్రయారిటీ జ్యువెల్స్
* కరోనా రెమెడీస్
* ఓం ఫ్రైట్ ఫార్వార్డర్స్
* జైన్ రిసోర్స్ రీసైక్లింగ్
* పేస్ డిజిటెక్
ఈ కంపెనీలు మార్చి-జూన్ మధ్య IPO ప్రాథమిక పేపర్స్ ఫైలింగ్ చేసి, ఆగస్టు 1-29 మధ్య SEBI నుండి "గో ఎహెడ్" పొందాయి. ప్రస్తుతం భారత IPO మార్కెట్ చాలా హాట్‌గా ఉంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు 50 కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో లిస్టింగ్ అయ్యాయి, ఆగస్టులో కూడా పలు కొత్త కంపెనీలు డెబ్యూట్ చేశాయి.
అర్బన్ కంపెనీ రూ.1,900 కోట్లు IPO ద్వారా raise చేయాలని ప్లాన్ చేస్తోంది, ఇందులో రూ. 429 కోట్లు కొత్త షేర్ల ద్వారా, మిగిలిన రూ. 1,471 కోట్లు ఇప్పటికే ఉన్న వాటాదారులు అమ్మడం ద్వారా raise చేయనున్నారు. OFS ద్వారా షేర్లను అమ్మే కంపెనీలు యాక్సెల్ ఇండియా, ఎలివేషన్ క్యాపిటల్, బెస్సేమర్ ఇండియా క్యాపిటల్ హోల్డింగ్స్ II లిమిటెడ్, ఇంటర్నెట్ ఫండ్ V ప్రైవేట్ లిమిటెడ్, VYC11 లిమిటెడ్.


Click it and Unblock the Notifications