For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి నిబంధనలకు సెబి సవరణ

|

సంబంధిత వృత్తిపరమైన అర్హతలను నిర్వచించడంతో సహా ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధుల(AIFs)కు సంబంధించిన నిబంధనల్ని సెబి సవరించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఇన్వెస్ట్‌మెంట్ టీం అర్హత, అనుభవ ప్రమాణాలను ఇండివిడ్యువల్‌గా లేదా సంయుక్తంగా నెరవేర్చవచ్చు. ఈ మేరకు సెబి బోర్డు సవరణలకు ఆమోదం తెలిపింది. దీంతో ఇది అమల్లోకి వచ్చింది.

'అలీబాబా' జాక్‌మా సహా భారీగా పెరిగిన చైనా కుబేరుల సంపద: 50% పైగా ఆదాయం జంప్'అలీబాబా' జాక్‌మా సహా భారీగా పెరిగిన చైనా కుబేరుల సంపద: 50% పైగా ఆదాయం జంప్

ఏఐఎఫ్ మేనేజర్ కీ ఇన్వెస్ట్‌మెంట్ టీంకు తగిన అనుభవం అవసరమని తెలిపింది. కనీసం ఒక కీలక వ్యక్తి మూలధనం లేదా ఆస్తులు లేదా బయ్యింగ్ అండ్ సెల్లింగ్, సెక్యూరిటీస్ డీలింగ్ వంటి వాటిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. ఇది కాకుండా కీ ఇన్వెస్ట్‌మెంట్ టీమ్‌కు గుర్తింపు పొందిన సంస్థ నుండి ఫైనాన్స్, అకౌంటెన్సీ, బిజినెస్ మేనేజ్‌మెంట్, కామర్స్, ఎకనమిక్స్, క్యాపిటల్ మార్కెట్ లేదా బ్యాంకింగ్‌లో ప్రొఫెషనల్ అర్హత కలిగినవారు ఒకరైనా ఉండాలి.

Sebi amends alternative investment fund rules

ఎక్స్‌పీరియన్స్, ప్రొఫెషనల్ క్వాలిఫికీషన్ అర్హత అవసరాలను అదే కీ పర్సనల్ ఫుల్‌ఫిల్ చేయవచ్చు. పెట్టుబడి నిర్ణయాలను ఆమోదించేందుకు మేనేజర్ కమిటీని ఏర్పాటు చేస్తే, ఏఐఎఫ్ పెట్టుబడుల నిర్ణయాలకు మేనేజర్ బాధ్యత వహిస్తారు. ఏఐఎఫ్ పెట్టుబడి నిర్ణయాలకు మేనేజర్‌తో సమానంగా పెట్టుబడి కమిటీ సభ్యులు బాధ్యత వహిస్తారు. కమిటీ మేనేజర్, సభ్యులు సంయుక్తంగా ఏఐఎఫ్ పెట్టుబడులు నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు నిర్ధారిస్తారు.

English summary

ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి నిబంధనలకు సెబి సవరణ | Sebi amends alternative investment fund rules

Markets regulator Sebi has amended norms pertaining to alternative investment funds (AIFs), including defining relevant professional qualifications.
Story first published: Wednesday, October 21, 2020, 21:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X