మొహర్రం సెలవుతో వరుసగా మూడు రోజులు బంద్.. ఆఫీసులు, బ్యాంకులకు కూడా వర్తిస్తుందా?
వేసవి సెలవుల తర్వాత ఇప్పుడిప్పుడే స్కూళ్లు, కాలేజీలు మళ్లీ ప్రారంభమవుతున్నాయి. కొత్త అకడమిక్ ఇయర్ (Academic Year) స్టార్ట్ కావడంతో విద్యార్థులంతా పుస్తకాల సంచులు సర్దుకుని క్లాసులకు హాజరవుతున్నారు. సాధారణంగా స్కూల్స్ ఓపెన్ అయిన కొత్తలో జూన్, జూలై నెలల్లో ప్రభుత్వ సెలవులు చాలా తక్కువగా ఉంటాయి. కానీ, ఈ ఏడాది జూన్ నెల చివర్లో విద్యార్థులకు, ఉద్యోగులకు ఒక సూపర్ లక్కీ ఛాన్స్ దక్కబోతోంది. జూన్ 26న రాబోతున్న ఒక ప్రభుత్వ సెలవు కారణంగా వరుసగా మూడు రోజుల పాటు లాంగ్ వీకెండ్ (Long Weekend) వచ్చే అవకాశం ఉంది.

3 రోజుల లాంగ్ వీకెండ్ ఎలా వస్తుందంటే?
ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం జూన్ 26వ తేదీన మొహర్రం (Muharram) పండుగ సందర్భంగా ప్రభుత్వ అధికారిక సెలవు ఉంది. ఈ ఏడాది జూన్ 26వ తేదీ సరిగ్గా 'శుక్రవారం' వచ్చింది. దీనివల్ల శుక్రవారం సెలవు దినం కాగా.. ఆ తర్వాతి రోజుల్లో శనివారం, ఆదివారం ఎలాగూ వీకెండ్స్ వస్తాయి. అంటే శుక్ర, శని, ఆదివారాలు వరుసగా మూడు రోజుల పాటు బ్రేక్ దొరకనుంది.
అంతేకాదు, ఈ శనివారం నెలలోని నాల్గవ శనివారం (Fourth Saturday) కావడంతో స్కూళ్లు, కాలేజీలతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు కూడా మూతపడనున్నాయి. దీనివల్ల అటు విద్యార్థులతో పాటు ఇటు ఉద్యోగులకు, బ్యాంక్ స్టాఫ్‌కు కూడా ఈ వరుస సెలవుల లబ్ధి చేకూరనుంది.
ఎవరెవరికి ఈ సెలవులు వర్తిస్తాయి?
వేసవి సెలవులు ముగిసి జూన్ మొదటి వారంలోనే విద్యాసంస్థలు పునఃప్రారంభం అయ్యాయి. చాలా చోట్ల కాలేజీలు జూన్ చివర్లో లేదా జూలై మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఈ లాంగ్ వీకెండ్ విద్యార్థులకు, తల్లిదండ్రులకు పెద్ద ఊరటనివ్వనుంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో లేదా కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థల్లో శనివారం నాడు కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి మీ స్కూల్ లేదా కాలేజ్ మేనేజ్‌మెంట్ ఇచ్చే అధికారిక నోటిఫికేషన్‌ను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.
షార్ట్ ట్రిప్స్ కోసం క్రేజీ ప్లాన్స్!
స్కూల్స్ రీఓపెన్ (School reopen) అయిన తర్వాత నిరంతరం క్లాసులు, కొత్త సిలబస్, హోమ్‌వర్క్‌లతో బిజీగా మారిన విద్యార్థులకు ఒత్తిడి నుండి ఉపశమనం పొందేందుకు ఈ జూన్ లాంగ్ వీకెండ్ ఒక మంచి అవకాశం. ఈ మూడు రోజుల విరామంతో చాలా కుటుంబాలు చిన్న చిన్న ట్రిప్స్ వేయడానికి, బంధువుల ఇళ్లకు వెళ్లడానికి లేదా ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా గడపడానికి ప్లాన్ చేసుకుంటున్నాయి. అలాగే మొహర్రం పండుగకు సంబంధించిన ఇబాదత్‌లు, మతపరమైన ఆచారాల్లో పాల్గొనేవారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా మారనుంది. ఎక్కడికైనా ప్రయాణాలు ప్లాన్ చేసేవారు ముందే లోకల్ హాలిడే లిస్ట్‌ను సరిచూసుకోవడం ఉత్తమం.
బ్యాంకులు, ఆఫీసులకు కూడా సెలవేనా?
ఈ మూడు రోజుల వరుస సెలవులు కేవలం పాఠశాలలు, కాలేజీలకే పరిమితం కాకుండా చాలా వరకు ప్రభుత్వ కార్యాలయాలకు , బ్యాంకులకు కూడా వర్తించనున్నాయి. జూన్ 26వ తేదీన మొహర్రం పండుగకు ప్రభుత్వం ఎన్-గోషీయబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ (Negotiable Instruments Act) ప్రకారం సెలవుగా ప్రకటించింది కాబట్టి ఆ రోజు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడతాయి. ఇక ఆ మరుసటి రోజు జూన్ 27 నెలలోని నాల్గవ శనివారం, ఆదివారాలు కావడంతో ఆటోమేటిక్‌గా బ్యాంకులకు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు రెగ్యులర్ హాలిడే ఉంటుంది.


Click it and Unblock the Notifications