నేడు తెలంగాణ, కర్ణాటకలో స్కూల్స్, కాలేజెస్ బంద్.. మాజీ ప్రధానికి సంతాపం తెలుపుతు ప్రకటన..
డిసెంబరు 26న 92 ఏళ్ల వయసులో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణించిన నేపథ్యంలో దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే గౌరవ సూచకంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ సంతాప దినాలను ప్రకటించింది. దింతో నేడు శుక్రవారం అన్ని అధికారిక కార్యకలాపాలు రద్దు కానున్నాయి.
తెలంగాణ, కర్ణాటకలో స్కూల్స్, కాలేజీలు బంద్
ఈ సంతాప ప్రకటనకు తోడుగా తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు డిసెంబర్ 27న ప్రభుత్వ సెలవుగా ప్రకటించాయి. హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రముఖ నగరాలతో సహా ఈ రాష్ట్రాల్లోని స్కూల్స్, కాలేజీలు ఇంకా ప్రభుత్వ కార్యాలయాలు నేడు మూసివేయబడతాయి. దేశానికి మాజీ ప్రధాని చేసిన సేవలను పురస్కరించుకుని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఏడు రోజుల సంతాప దినాలను ప్రకటించారు. అయితే, ఇతర రాష్ట్రాల నుండి ఇలాంటి ప్రకటన వెలువడలేదు.

డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పై AIIMS అధికారిక ప్రకటన
న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. ఆసుపత్రి ప్రకారం, అతను తన ఇంట్లో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయాడు దింతో వెంటనే రాత్రి 8 గంటలకు ఎయిమ్స్‌లో చేర్చారు, వైద్య బృందం ఎంత ప్రయత్నించినప్పటికీ స్పృహలోకి రాలేదు, చివరికి రాత్రి 9:51 గంటలకు AIIMS అతని మరణాన్ని ధృవీకరించింది. ఒక అధికారిక ప్రకటనలో వయస్సు-సంబంధిత ఆరోగ్య సమస్యలకు కారణంగా మరణించినట్లు వెల్లడించారు.
ఆర్థికవేత్తగా, గొప్ప నాయకుడిగా డాక్టర్ మన్మోహన్ సింగ్‌కి దేశం నలుమూలల నుంచి రాజకీయ నాయకులు, ప్రముఖులు నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ భారతదేశపు అత్యంత గొప్పా నాయకులలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒకరని అభివర్ణించారు. లక్షలాది మంది భారతీయుల జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రధానిగా ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది' అని ప్రధాని మోదీ ఒక సందర్బంగా తెలిపారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అతనిని తన గురువు ఇంకా మార్గదర్శకుడు అని అన్నారు, అతని ఆలోచన, వినయం ఇంకా ఆర్థికశాస్త్రంపై లోతైన అవగాహనను హైలెట్ చేసారు. మన్మోహన్ సింగ్ భార్య కౌర్ ఇంకా అతని కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతి ప్రకటిస్తూ మనలో లక్షలాది మంది ఆయనను ఎప్పుడూ గర్వంగా స్మరించుకుంటాం" అని అన్నారు.
ప్రియాంక గాంధీ వాద్రా కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ నిజాయితీ, దేశం పట్ల నిబద్ధతను కొనియాడుతూ నివాళిలు ప్రకటించారు. భారతదేశానికి సేవ చేయడంలో అతని దృఢమైన అంకితభావం స్ఫూర్తిగా నిలుస్తుంది" అని ఆమె అన్నారు.


Click it and Unblock the Notifications