ఎవరికైనా జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు.. ఆ కష్టాలే అతడిని మరింత బలంగా తీర్చిదిద్దుతాయనే మాట తరచూ వింటుంటాం. కొందరికి ఆ మాటలు మాటలుగానే మిగిలిపోతాయి. అయితే మరికొందరు మాత్రం అదే కష్టాన్ని తమ జీవితాన్ని మలిచే ఆయుధంగా మార్చుకుంటారు. అలాంటి అరుదైన వ్యక్తులలో ఒకరు..భారతదేశానికి చెందిన 'వైర్ కింగ్' ఇందర్ జైసింఘాని.
ఈ రోజు దేశంలోనే అతిపెద్ద వైర్లు-కేబుల్స్ కంపెనీ అయిన పాలీక్యాబ్‌కు ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఇందర్ జైసింఘాని జీవితం ఒకప్పుడు పేదరికం, అనిశ్చితి, బాధ్యతల భారంతో నిండిపోయింది. ముంబైలోని లోహర్ చావల్ అనే చిన్న ప్రాంతంలో.. అతి సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన బాల్యం అంత సులభంగా గడవలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అప్పటికే బలహీనంగా ఉన్న సమయంలో.. 15 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోవడం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.

తండ్రి మరణంతో కుటుంబ బాధ్యతలన్నీ చిన్న వయసులోనే ఇందర్ భుజాలపై పడ్డాయి. చదువును మధ్యలోనే మానేసి, కుటుంబాన్ని నిలబెట్టే బాధ్యతను స్వీకరించాడు. అప్పట్లో ఆయన తండ్రి నడిపే చిన్న ఎలక్ట్రికల్ షాప్ 'సిండ్డ్ ఎలక్ట్రిక్ స్టోర్స్' మాత్రమే కుటుంబానికి ఆధారం. ఆ చిన్న దుకాణం నుంచే ఒక మహా పరిశ్రమకు బీజం పడింది.
ప్రారంభంలో ఎలక్ట్రికల్ వస్తువుల వ్యాపారంలో సహాయపడుతూ.. మార్కెట్ అవసరాలు, వినియోగదారుల నమ్మకం, నాణ్యత విలువను అర్థం చేసుకున్నాడు Inder Jaisinghani. 1975లో తన సోదరులతో కలిసి ముంబైలోని MIDC అంధేరిలో ఠాకూర్ ఇండస్ట్రీస్ పేరుతో కేబుల్స్, వైర్ల తయారీ యూనిట్‌ను ప్రారంభించాడు. ఇదే ఆయన పారిశ్రామిక ప్రయాణానికి అసలు మలుపుగా మారింది.
1983లో గుజరాత్ ప్రభుత్వ పరిశ్రమల శాఖ ద్వారా 'పాలీక్యాబ్ ఇండస్ట్రీస్' చిన్న పరిశ్రమగా నమోదు అయింది. క్రమంగా వ్యాపారం విస్తరిస్తూ, 1996లో పాలీక్యాబ్ వైర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌గా మారింది. 1997లో ఇందర్ జైసింఘాని కంపెనీకి ఛైర్మన్, డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలీక్యాబ్ గమనమే మారిపోయింది. 1998లో డామన్‌లో ఆధునిక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, పవర్ కేబుల్స్, హౌస్ వైర్లు, టెలిఫోన్ కేబుల్స్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వంటి విస్తృత ఉత్పత్తులతో మార్కెట్‌ను ఆక్రమించింది. 2006 నాటికి కంపెనీ ఆదాయం రూ.10 వేల మిలియన్ల మైలురాయిని దాటింది. 2011లో ఇది రూ.31 వేల మిలియన్లకు చేరింది.
2013లో పాలీక్యాబ్ స్విచ్‌లు, ఫ్యాన్లు, LED లైటింగ్ వంటి FMEG విభాగాల్లోకి అడుగుపెట్టింది. నాసిక్‌లో MCB తయారీ యూనిట్లను విస్తరించి, పూర్తి ఎలక్ట్రికల్ సొల్యూషన్ కంపెనీగా అవతరించింది. ఈ ప్రతి అడుగులోనూ ఇందర్ జైసింఘాని దూరదృష్టి కీలక పాత్ర పోషించింది. 2019లో పాలీక్యాబ్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. BSE, NSEలలో జరిగిన IPOకు 52 రెట్లు సబ్‌స్క్రిప్షన్ రావడం కంపెనీపై పెట్టుబడిదారుల నమ్మకాన్ని స్పష్టం చేసింది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం.. ఇవాళ ఇందర్ జైసింఘాని నికర విలువ సుమారు 7.96 బిలియన్ డాలర్లు. అంటే దాదాపు రూ.70 వేల కోట్లకు పై మాటే.
ఇప్పటికే ఈ రంగంలో అదానీ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్ వంటి దిగ్గజాలు ప్రవేశించినప్పటికీ, పాలీక్యాబ్ ఇప్పటికీ మార్కెట్ లీడర్‌గా నిలుస్తోంది. ఒక చిన్న చావల్ నుంచి దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ సామ్రాజ్యం.. కష్టం, పట్టుదల, దీక్ష ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు అని చాటి చెబుతోంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications