Schemes for Women: వివిధ వర్గాల అవసరాలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు స్కీమ్స్ అందిస్తుంటాయి. వీటిలో కొన్ని వారికి అత్యంత చేరువ కాగా.. మరికొన్ని పేర్లు కూడా విని ఉండరు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సందర్బంగా దేశంలో మహిళల కోసం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు ఏంటో ఓసారి లుక్కేద్దాం..
ఆర్థిక వ్యవస్థలో మహిళా భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వాలు సీరియస్‌గా చర్యలు తీసుకుంటున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని స్కీమ్స్ అమలు చేస్తున్నాయి. పొదుపు ఖాతాలు దగ్గర నుంచి, ఫిక్స్డ్ డిపాజిట్లు, లోన్లు, క్రెడిట్ కార్డులు వంటి వివిధ విభాగాల్లో వారికోసం స్పెషల్ పథకాలు అందుబాటులో ఉన్నాయి.

వారి అభివృద్దికి బ్యాంకులు సర్వత్రా చేదోడుగా నిలుస్తున్నాయి. ఉన్నవ్యాపారాన్ని విస్తరించాలనుకునే మహిళలకు SBI స్త్రీ శక్తి స్కీమ్ ద్వారా 50 లక్షల వరకు రుణాన్ని అందిస్తోంది. ఓరియెంట్ బ్యాంక్ కూడా మహిళా వికాస్ యోజన పేరిట మహిళలు ప్రారంభించే చిన్న వ్యాపారాలకు 25 లక్షల వరకు కొల్లాటరల్ ఫ్రీ లోన్స్ ఇస్తోంది. ఇవేకాక భారతీయ మహిళా బ్యాంక్, అన్నపూర్ణ స్కీమ్ వంటి స్కీమ్స్ కూడా చేదోడుగా నిలుస్తాయి.
ఇక ప్రభుత్వ పథకాల విషయానికి వస్తే, TEAD స్కీమ్ ద్వారా MSME వ్యాపారాలకు కావాల్సిన రుణం, గ్రాంట్‌తో పాటు శిక్షణ కూడా కేంద్రం అందిస్తోంది. మహిళా శక్తి కేంద్రాల ద్వారా కూడా నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి మహిళలకు ఉపాధి కల్పించే విధంగా ప్లాన్ చేసింది. మహిళా-ఈ-హాత్ ద్వారా తమ వ్యాపారాలు, ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. వీటికి తోడు ముద్ర లోన్స్, ప్రధాన మంత్రి రోజ్గార్ యోజన, మహిళా ఉద్యమ్ నిధి, ఉద్యోగిని స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి.
పెట్టుబడుల పరంగా చూస్తే 7.5 శాతం వడ్డీతో కూడిన మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజనను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. సుకన్య సమృద్ధి యోజన పేరిట 8.2 శాతం వడ్డీతో బాలికల కోసం ప్రత్యేక పొదుపు పథకాన్ని కేంద్రం నిర్వహిస్తోంది. ఇవే కాక నెలవారీ మినిమం బ్యాలెన్స్, బ్యాంక్ లావాదేవీల్లో ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. వివిద లోన్ల ప్రాసెసింగ్ ఫీజు, వడ్డీరేట్లపైనా కొన్ని బ్యాంకులు డిస్కౌంట్స్ ఇస్తున్నాయి.


Click it and Unblock the Notifications