Elon Musk: టెస్లాకు కలిసి రానున్న మోదీ సర్కార్ ఈవీ పాలసీ.. ఇండియాలో మస్క్ వ్యాపారం స్టార్ట్..
Tesla India: చాలా సంవత్సరాలుగా ఎలాన్ మస్క్ తన వ్యాపారాలను ఇండియా లాంటి పెద్ద దేశానికి విస్తరించాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన ఎలక్ట్రిక్ కార్లతో పాటు శాటిలైట్ ఇంటర్నెట్ స్టార్ లింక్ సేవలను భారతీయ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇన్నాళ్లు దానికి పరిస్థితులు అనుకూలంగా లేకపోవటంతో మస్క్ కూడా వెనకడుగువేస్తూ వచ్చారు.
కానీ అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అయితే ఇప్పుడు టెస్లా భారతదేశంలో తన కార్యకలాపాలను ప్రారంభించటానికి ఇప్పటికే దిల్లీ, ముంబైలో ఉద్యోగుల నియామకంతో పాటు షోరూమ్ ఏర్పాటుకు సన్నాహాలు కూడా చేస్తోంది. మోదీ సర్కార్ గత సంవత్సరంలో ప్రకటించిన ప్రోత్సాహక కార్యక్రమం త్వరలో ఆవిష్కరించనున్న మార్గదర్శకాల ప్రకారం భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఆన్-ట్యాప్ సౌకర్య ప్రక్రియను ప్రవేశపెట్టవచ్చని వెల్లడైంది. ఇది టెస్లా వంటి కంపెనీలకు అవకాశాన్ని కల్పించనుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ సౌకర్యం టెస్లా లాంటి విదేశీ సంస్థలు ఇండియాలోని ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెట్టుబడులు పెట్టడానికి మునుపే భారత మార్కెట్ గురించి పూర్తిగా అధ్యనం చేయటానికి వారికి అవకాశం కల్పించనుంది. 2024లో ప్రకటించబడిన భారతదేశంలో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల తయారీ స్కీమ్ అమలు కోసం వేచి ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రానున్న కొన్ని వారాల్లోనే ఇది అన్ని చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసుకుని అమలులోకి రానున్నట్లు వెల్లడైంది. ఈ స్కీమ్ కింద దేశంలో ఈవీలను తయారు చేసే కంపెనీలకు సుంకాలను తగ్గించాలని నిర్ణయించబడింది. అలాగే ఈ రంగంలో ఛార్జింగ్ ఇన్ ఫ్రాతో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసే సంస్థలకు సైతం ప్రయోజనాలు అందించబడతాయి.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలసీ కింద స్కీమ్ కింద దేశంలో 500 మిలియన్ డాలర్లను స్థానిక మ్యానుఫ్యాక్చరింగ్ పై పెట్టుబడి పెట్టిన సంస్థలు 5 సంవత్సరాల పాటు 35000 డాలర్లు విలువైన పూర్తిగా నిర్మించిన ఎలక్ట్రిక్ కార్లను దిగుమతి చేసుకోవచ్చు. ఇక్కడ దిగుమతి సుంకం 15 శాతంగా మాత్రమే ఉంటుందని నిర్ణయించబడింది.ఇప్పటికే వార్తల్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం టెస్లా 21 లక్షల రేటు స్థాయిలో టెస్లా కార్లను ఇండియాలో విక్రయానికి తీసుకురానున్నట్లు వెల్లడైంది. గతంలో ఇండియా మార్కెట్లపై ఆసక్తిగల వాహన తయారీదారులు ప్రత్యేకమైన EV సౌకర్యాల పెట్టుబడి అవసరాల గురించి ఆందోళన వ్యక్తం చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి.


Click it and Unblock the Notifications