Stock Market Scams: నిన్నటి వరకు సెలబ్రిటీల చుట్టూ తిరిగిన డీప్ ఫేక్స్ అంశం తాజాగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను చేరుకుంది. అనేక మంది ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ ఇన్వెస్టర్లను బురిడీ కొట్టిచే పనిలో ఉన్నారు.
డీప్‌ఫేక్‌ల సృష్టి పెద్ద సమస్యగా మారింది. సైబర్ మోసగాళ్లు వీటిని వినియోగించి ఫేక్ ఇమేజెస్, వాయిస్, వీడియోలను తయారు చేస్తున్నారు. ఇవి కొందరికి ఆర్థిక పరమైన, వ్యక్తిగత, వృత్తిపరమైన నష్టాలను కలిగిస్తున్న విషయాలు రోజూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వీటిని కేంద్రం సైతం చాలా సీరియస్‌గా తీసుకుంది. కొందరు బాధితులు ఇటువంటి మోసాలకు బలైపోతున్నారు.

నవంబర్ 22న దేశంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెరోధా.. ఒక కస్టమర్ రూ.1.80 లక్షల స్కామ్‌ను తృటిలో తప్పించుకున్న సంఘటనను నివేదించింది. డీప్‌ఫేక్‌లను సృష్టించే యాప్స్ విపరీతంగా అందుబాటులోకి రావటంతో ఇలాంటి మోసపూరిత దాడులు పెరుగుతున్నాయని కంపెనీ CEO నితిన్ కామత్ హెచ్చరించారు. 2019లో బ్రిటీష్ ఎనర్జీ కంపెనీకి చెందిన ఒక ఉద్యోగి కంపెనీ సీఈవో డీప్‌ఫేక్ వాయిస్ కారణంగా రూ.20 కోట్లకు పైగా మోసానికి గురయ్యాడు. ఇక 2020లో హాంకాంగ్‌లో ఉన్న ఒక బ్యాంక్ మేనేజర్ అత్యంత నమ్మదగిన డీప్‌ఫేక్ కాల్ కారణంగా రూ.288.7 కోట్లు కోల్పోవటం పెద్ద దుమారం సృష్టించింది.
ఈ లెక్కన ప్రస్తుత కాలంలో ప్రజలు చూస్తున్నది, వింటున్నది, చదువుతున్నది అంతా 100 శాతం నిజం అనటానికి అస్సలు ఆస్కారం లేదు. ఈ సంవత్సరం ప్రారంభం మే నెలలో పెంటగాన్ (అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రధాన కార్యాలయం) వద్ద జరిగిన పేలుడుకు సంబంధించిన డీప్‌ఫేక్ చిత్రం వైరల్‌గా మారటంతో అక్కడి స్టాక్ మార్కెట్లు పతనమైన సంగతి తెలిసిందే. దీనికి తోడు
స్కామర్లు ఇప్పుడు స్టాక్ ట్రేడింగ్‌కి సంబంధించిన లాభనష్టాలు, లెడ్జర్‌లు, ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లు బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన రిపోర్టులను క్లోన్ యాప్స్ ద్వారా నకిలీలను తయారు చేస్తున్నారు. వీటిని వినియోగించి వీడియోలు చేసి వైరల్ చేస్తున్నారు. వీరి మాటలు నమ్మి పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్ముతున్న కొందరు నష్టాల పాలవుతున్నారు. అందుకే స్టాక్ అడ్వైజరీ మోసాలకు ఏఐ మరింత సహాయకారిగా నిలుస్తోందని, ఇన్వెస్టర్లు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications