సైబర్ స్కామ్‌లు ఎంత అడ్వాన్స్ అవుతున్నాయో కొత్తగా చెప్పనక్కర్లేదు. దీనికి తోడు ఆన్ లైన్ మోసాలు రోజురోజుకు కొత్త కొత్త విధంగా పుట్టుకొస్తున్నాయి. దీనికి సంబంధించి సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు ఇప్పుడు ఒక కొత్త ఆన్‌లైన్ స్కామ్ గురించి బయటపెట్టారు. ఇప్పుడు సైబర్ నేరస్థులు నిరుద్యోగులను టార్గెట్ చేసుకొని ముఖ్యంగా కొత్త ఉద్యోగాల కోసం చూస్తున్న వారిని టార్గెట్ చేసింది. ఈ స్కాం లింక్డ్ఇన్, వీడియో కాలింగ్ యాప్ ద్వారా జరుగుతుంది.
BleepingComputer ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం, సైబర్ స్కామర్లు ఇప్పుడు లింక్డ్ఇన్ ఇతర యాప్స్ ప్లాట్‌ఫామ్‌లలో నకిలీ జాబ్స్ పోస్ట్ చేస్తున్నారు. ఈ జాబ్ పోస్టింగ్ గురించి క్లిక్ చేసిన వారిని స్కామర్లు వారిని మోసం చేసేందుకు grasscall app అనే హానికరమైన వీడియో కాల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోమంటారు. ఈ యాప్ ద్వారా వారు మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లలో సేవ్ చేసిన బ్యాంక్ వివరాలతో సహా సున్నితమైన సమాచారాన్ని హ్యాక్ చేస్తారు. నివేదిక ప్రకారం, ఇప్పటివరకు వరకు వందలాది మంది హ్యాకర్ల ఉచ్చులో పడి డబ్బులు పోగొట్టుకున్నారు. గ్రాస్‌కాల్ మాల్వేర్ Mac అండ్ Windows డివైజెస్ ప్రభావం చేస్తుంది.

హ్యాకర్ల గ్రూప్ LinkedIn, WellFound, CryptoJobsList వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లలో నకిలీ జాబ్స్ పోస్ట్ చేయడం ద్వారా ఈ స్కామ్ మొదలుపెట్టారు. "ChainSeeker.io" అనే నకిలీ కంపెనీ ముసుగులో పనిచేస్తున్న సైబర్ నేరస్థులు X, LinkedIn వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ప్రొఫెషనల్ వెబ్‌సైట్ ఇంకా సోషల్ మీడియా ప్రొఫైల్‌లతో సహా ఫేక్ ఆన్‌లైన్ సైట్ సృష్టించారు. నివేదిక ప్రకారం, ఈ ప్రొఫైల్స్ చట్టబద్ధంగా కనిపించేలా రూపొందించారు. ఉద్యోగాలకు కోసం అప్లయ్ చేసుకున్న తర్వాత, వారికి వర్చువల్ ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తూ ఒక ఇమెయిల్ వస్తుంది. మీటింగ్ షెడ్యూల్ చేయడానికి టెలిగ్రామ్ ద్వారా కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌ను సంప్రదించాలని ఇమెయిల్లో వారికి సూచిస్తుంది. మీటింగ్ సమయంలో "గ్రాస్‌కాల్" అనే వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆదేశిస్తుంది.
అయితే, గ్రాస్‌కాల్ యాప్ చాల హానికరమైనది. ఫోన్ లేదా కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసిన తర్వాత సైబర్ నేరస్థులు, స్కామర్‌లు మీ డివైజెస్లో సేవ్ చేసిన వివరాలను దొంగిలించడానికి ఈ యాప్‌ను ఉపయోగిస్తారు. నివేదిక ప్రకారం, గ్రాస్‌కాల్ యాప్ OS ఆధారంగా వివిధ రకాల మాల్వేర్‌లను ఇన్‌స్టాల్ చేస్తుంది: విండోస్‌లో రిమోట్ యాక్సెస్ ట్రోజన్ (RAT), రాడమంథిస్ అనే ఇన్ఫో-స్టీలర్‌ను ఇన్‌స్టాల్ చేస్తుంది. Macలో సున్నితమైన డేటాను దొంగిలించడానికి ప్రత్యేకంగా రూపొందించిన మాల్వేర్ అయిన అటామిక్ స్టీలర్ (AMOS)ను ఇన్‌స్టాల్ చేస్తుంది. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఈ మాల్వేర్ క్రిప్టోకరెన్సీ వాలెట్ వివరాలు, బ్రౌజర్ లేదా సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లు, ఫైనాన్స్‌కు సంబంధించిన డేటా ఉన్న ఫైల్‌లతో సహా సున్నితమైన సమాచారం కోసం స్కాన్ చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2025-26 హైలెట్స్: ఏ పథకానికి ఎన్ని నిధులంటే..?
ఈ స్కామ్ బయటపడిన తర్వాత, క్రిప్టోజాబ్స్‌లిస్ట్ నకిలీ ఉద్యోగాలను తొలగించి యూజర్లను హెచ్చరించింది. గ్రాస్‌కాల్ వెబ్‌సైట్‌ను అప్పటి నుండి తొలగించారు. సైబర్ నేరస్థుల ఇలాంటి దోపిడీ నుండి జాగ్రత్తగా ఉండాలని అప్పుడే ఇలాంటి మోసాల నుండి బయటపడవచ్చని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications