నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(NCLT)లో దివాలా పిటిషన్ దాఖలు చేయడానికి కనీసం 100 మంది గృహ కొనుగోలుదారులు కలిసి రావాలని సవరించిన ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్(IBC) 2020ను మంగళవారం సుప్రీం కోర్టు సమర్థించింది. రియల్ ఎస్టేట్ సంస్థలపై చర్యల కోసం గత ఏడాది దివాలా చట్టానికి పార్లమెంటు సవరణలు చేసింది. దీనిని భారత అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.
దీనికి సంబంధించి శాసన వ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదించలేమని తేల్చి చెప్పింది. ఎవరైనా బిల్డర్ ఒప్పందం ప్రకారం తన బాధ్యత నెరవేర్చకపోతే ఆ ప్రాజెక్టులో ఇల్లు లేదా ప్లాట్ కొన్న ఓ వ్యక్తి అయినా దివాలా ప్రక్రియను చేపట్టేందుకు ఇదివరకు అవకాశం ఉండేది. అయితే గత ఏడాది దీనిని వందమంది కొనుగోలుదారులు లేదా కేటాయింపులు పొందిన వారిలో కనీసం పది శాతం మందికి పెంచుతూ సవరణలు ఆమోదించింది.

రియల్ ఎస్టేట్ లాబీకి తలొగ్గి సవరణలు చేశారని పిటిషనర్ వాదనలు వినిపించగా, సుప్రీం కోర్టు దీనిని తోసుపుచ్చింది. కేవలం ఒక వ్యక్తికి బిల్డర్లపై దివాలా ప్రక్రియ చేపట్టే హక్కు ఉంటే అది దుష్పరిణామాలకు దారి తీస్తుందని తెలిపింది. జస్టిస్ రోహింటన్ ఫాలీ నారిమన్, కేఎం జోసెఫ్, నవీన్ సిన్హాలతో కూడిన ధర్మాసనం దీనిని విచారించింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications