For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాటా-మిస్త్రీ ఇష్యూ: ఆ తీర్పుపై సుప్రీం కోర్టు స్టే

|

టాటా గ్రూప్ - సైరస్ మిస్త్రీ వ్యవహారంలో భారత అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం NCLAT ఆదేశాలపై స్టే ఇచ్చింది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ (ROC) దాఖలు చేసిన పిటిషన్‌ను నేషనల్ కంపెనీస్ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (NCLAT) తిరస్కరిస్తూ తీర్పు ఇచ్చింది. దీనిని తాజాగా సుప్రీం కోర్టు నిలుపుదల చేసింది.

టాటా సన్స్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తిరిగి నియమించాలని ఇచ్చిన తీర్పులో కొన్ని సవరణలు చేయాలని NCLATని ROC అభ్యర్థించింది. దీనికి NCLAT నిరాకరించంతో ROC సుప్రీం కోర్టుకు వెళ్లింది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ROC విజ్ఞప్తిని NCLAT తిరస్కరిస్తూ ఇచ్చిన తీర్పును నిలుపుదల చేసింది.

టాటా సన్స్ - సైరస్ మిస్త్రీ ఇష్యూ

SC stays NCLAT order reinstating Cyrus Mistry as Tata group chairman, issues notice to Mistry

సైరస్ మిస్త్రీ పునర్నియామకాన్ని సవాల్ చేస్తూ టాటా సన్స్ వేసిన పిటిషన్‌తో పాటు విచారిస్తామని తెలిపింది. మిస్త్రీ పునర్నియామకాన్ని సుప్రీం కోర్టు ఈ నెల 10వ తేదీన నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మిస్త్రీకి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

English summary

టాటా-మిస్త్రీ ఇష్యూ: ఆ తీర్పుపై సుప్రీం కోర్టు స్టే | SC stays NCLAT order reinstating Cyrus Mistry as Tata group chairman, issues notice to Mistry

The Supreme Court on Friday stayed the National Company Law Appellate Tribunal's order dismissing the Registrar of Companies (RoC) plea seeking modification of its verdict in the Tata-Cyrus Mistry matter.
Story first published: Friday, January 24, 2020, 15:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X