టాటా సన్స్‌కు సుప్రీం కోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (NCLAT) ఆదేశాలలోని అతిక్రమణలను తొలగించాలని కోరుతూ సైరస్ మిస్త్రీ, ఆయన కంపెనీ దాఖలు చేసిన క్రాస్ అప్పీలు నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం టాటా సన్స్ సహా మరికొందరికి నోటీసులు జారీ చేసింది.

టాటా వర్సెస్ సైరస్
గత ఏడాది డిసెంబర్ 18వ తేదీన సైరస్ మిస్త్రీని తిరిగి టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించాలని చెబుతూ NCLAT ఆదేశాలు జారీ చేసింది. టాటా సన్స్ పిటిషన్ నేపథ్యంలో NCLAT జారీ చేసిన ఆదేశాలపై సుప్రీం కోర్టు టాటా గ్రూప్‌కు ఊరట కల్పించింది. దీనిపై న్యాయస్థానంలో వివాదం కొనసాగుతోంది.

వాటాకు తగిన ప్రాతినిథ్యం
ఆ తర్వాత సైరస్, ఆయన కంపెనీలు క్రాస్ అప్పీల్‌కు దాఖలు చేసుకున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ విచారణలో సైరస్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రయివేటు లిమిటెడ్ దాఖలు చేసిన క్రాస్ అప్పీలుపై న్యాయమూర్తులు జస్టిస్ ఎఎస్ బొపన్న, రిషికేష్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. మిస్త్రీ, ఆయన కుటుంబానికి టాటా సన్స్‌లో ఉన్న 18.37 శాతానికి అనుగుణంగా కంపెనీలో ప్రాతినిథ్యం ఉండాలని క్రాస్ అప్పీల్‌లో కోరారు. సైరస్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రయివేటు లిమిటెడ్, సైరస్ మిస్త్రీ

రూ.1.5 లక్షల కోట్లుగా..
టాటాలతో తమ గ్రూప్‌కో అరవై ఏళ్ల అనుబంధం ఉందని, టాటా సన్స్‌లో 18.37 శాతం వాటా కలిగి ఉన్నామని, దీని వ్యాల్యూ రూ.1.5 లక్షల కోట్లుగా ఉంటుందని తన పిటిషన్‌లో సైరస్ మిస్త్రీ చెప్పారు. 2012లో రతన్ టాటా తర్వాత టాటా సన్స్ చైర్మన్‌గా మిస్త్రీ నియమించబడ్డారు. కానీ నాలుగేళ్ల తర్వాత తొలగించారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications