సాధారణంగా, బ్యాంకులు 3% నుంచి 7% వరకు వడ్డీ ఇస్తాయి. అలాగే, సేవింగ్స్ అకౌంట్ ద్వారా డబ్బు ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చుని, అది సురక్షితంగా ఉండి వడ్డీ కూడా వస్తుంది. కాబట్టి, అకౌంట్ ఓపెన్ చేసేముందు వడ్డీ రేట్లు, మినిమమ్ బ్యాలెన్స్ అవసరం, ఛార్జీలు, ఆన్‌లైన్ సౌకర్యాలు వంటి వాటిని పోల్చి చూసి నిర్ణయం తీసుకోవాలి. ఇలా చేస్తే మీ డబ్బు సేఫ్‌గా ఉండి మంచి రాబడులు కూడా వస్తాయి. 2025లో ఎక్కువ వడ్డీ రాబడులు పొందాలంటే సరైన సేవింగ్స్ అకౌంట్‌ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.
పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ (POSA) ఈసారి వార్షిక "4% ఫిక్స్‌డ్ వడ్డీ" ఇస్తోంది. అంటే, బ్యాలెన్స్ ఎంత ఉన్నా ఈ రేట్ వర్తిస్తుంది. ఇది ఇతర బ్యాంక్‌ల కంటే ఎక్కువ రాబడి ఇస్తుందని చెప్పవచ్చు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ప్రభుత్వం ప్రతి క్వార్టర్‌లో వడ్డీ రేటును సమీక్షిస్తుంది. FY 2025-26 అక్టోబర్-డిసెంబర్ కోసం ఆ రేట్ సెప్టెంబర్ 30, 2025న అన్ చేంజెడ్ గా ఉంచారు.

SBI సేవింగ్స్ అకౌంట్ మాత్రం ఇప్పుడు "2.5% వార్షిక వడ్డీ" ఇస్తోంది. SBI లో వడ్డీ క్వార్టర్ల వారీగా చెల్లించబడుతుంది. ముందే బ్యాలెన్స్ ఆధారంగా రెండు రేట్లు ఉండేవి, కానీ ఇప్పుడు అన్ని బ్యాలెన్స్‌లకు ఒకే రేటు 2.5% వర్తిస్తుంది. ప్రస్తుతానికి HDFC, ICICI బ్యాంకులు కూడా అదే రేటు ఇస్తున్నాయి.
పోస్ట్ ఆఫీస్ అకౌంట్‌లో వడ్డీ "ప్రతి నెల 10వ తేదీ నుంచి చివరి వరకు కనీస బ్యాలెన్స్" ఆధారంగా లెక్కించబడుతుంది. వడ్డీ ఆర్థిక సంవత్సరపు చివరలో ఖాతాకు జమ అవుతుంది. అకౌంట్ మూసినప్పుడు, మునుపటి నెల వరకు వడ్డీ చెల్లించబడుతుంది. రెండు అకౌంట్లు కూడా "80TTA సెక్షన్ కింద" ట్యాక్స్ బెనిఫిట్ పొందగలవు. వ్యక్తులు లేదా HUFs ప్రతి ఆర్థిక సంవత్సరంలో రూ. 10,000 వరకు వడ్డీపై డిడక్షన్ పొందవచ్చు.
2025 నాటికి ప్రముఖ బ్యాంకులు అందిస్తున్న సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. ప్రస్తుతం HDFC బ్యాంక్ అన్ని సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్‌లపై వార్షికంగా 2.50% వడ్డీ ఇస్తోంది. అదే విధంగా, ICICI బ్యాంక్ కూడా 2025 జూన్ 26 నుంచి అన్ని బ్యాలెన్స్‌లకు 2.5% వడ్డీ రేటునే అందిస్తోంది. అయితే, HDFC బ్యాంక్‌లో ఉన్నత బ్యాలెన్స్‌లకు కొంచెం ఎక్కువ వడ్డీ రేటు ఉంది. ఉదాహరణకు, రూ. 50 లక్షల వరకు ఉన్న బ్యాలెన్స్‌ల పై 2.75%, రూ. 50 లక్షల కంటే ఎక్కువ బ్యాలెన్స్‌ల పై 3.25% వడ్డీ రేటు ఇస్తున్నారు. అంటే, ఎక్కువ మొత్తంలో డబ్బు ఉంచేవారికి కొంత అదనపు రాబడి లభించే అవకాశం ఉంది.
పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్‌లో ప్రస్తుతం 4% వడ్డీ ఇస్తున్నారు. ఈ వడ్డీని ప్రతి సంవత్సరం ఒకసారి క్రెడిట్ చేస్తారు, కాబట్టి లెక్కింపు సులభంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా సులభంగా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, అందుకే ఇది చాలామందికి నమ్మదగిన ఆప్షన్. మరోవైపు, SBI సేవింగ్స్ అకౌంట్‌లో సుమారు 2.5% వడ్డీ ఇస్తారు. ఈ వడ్డీని ప్రతి మూడు నెలలకొకసారి (క్వార్టర్‌గా) క్రెడిట్ చేస్తారు. SBI డిజిటల్ బ్యాంకింగ్ సౌకర్యాలు చాలా బాగా అందిస్తుంది. మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎప్పుడు ఎక్కడినుంచైనా డబ్బును యాక్సెస్ చేయవచ్చు. అలాగే, వివిధ రకాల అకౌంట్లు, ఫ్లెక్సిబుల్ ట్రాన్సాక్షన్ ఆప్షన్లు ఉండటంతో, రోజువారీ వాడుకకు ఇది బాగా సరిపోతుంది.
సంక్షిప్తంగా, మీరు ఎక్కువ రాబడిని కోరుకుంటే, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఉత్తమం. కానీ డిజిటల్ సౌకర్యాలు, క్వార్టర్‌లవారీ వడ్డీ, ఫ్లెక్సిబుల్ యాక్సెస్ ముఖ్యమని భావిస్తే SBI కూడా చక్కగా పనిచేస్తుంది.


Click it and Unblock the Notifications