SBI News: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ యాజమాన్యంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) గత సంవత్సరంతో పోలిస్తే స్థూల మొండి బకాయిలు తగ్గాయి. అయితే బ్యాంక్ తన అకౌంట్స్ లో ఉన్న బ్యాడ్ లోన్స్ క్లీన్ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలో కష్టతరమైన రూ.96,278 కోట్ల రుణాలను అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీలకు విక్రయించాలని యోచిస్తోంది. ఎస్‌బీఐ పుస్తకాల్లో ఫ్యూచర్ గ్రూప్, అనిల్ అంబానీ ప్రమోట్ చేసిన కంపెనీలు, వీడియోకాన్ గ్రూప్, జేపీ గ్రూప్‌లతో సహా మెుత్తం 331 లోన్ ఖాతాల్లో రూ.96,278 కోట్ల మెుత్తం పంపిణీ చేయబడింది. గడచిన ఏడాది బ్యాంక్ 168 ఖాతాలకు సంబంధించి రూ.31,363 కోట్లు మెుండి బకాయిలు ప్రస్తుతం మూడింతలయ్యాయి.

Q1FY23లో రూ.1,13,272 కోట్ల నుంచి.. FY24 మొదటి త్రైమాసికంలో బ్యాంక్ స్థూల మొండి బకాయిలు రూ.91,328 కోట్లకు పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ఫ్యూచర్ గ్రూప్‌కు రూ.2,254 కోట్లు, అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు రూ.5,440 కోట్లు, జేపీ గ్రూపునకు రూ.4,701 కోట్లు, వీడియోకాన్ గ్రూప్ కంపెనీలకు రూ.9,504 కోట్ల రుణాలు ఉన్నాయి. అలాగే రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూ.3,014 కోట్లు, రిలయన్స్ టెలికాం రూ.167 కోట్లు, ఎయిర్‌సెల్ గ్రూప్ రూ.6,978 కోట్లు, వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్ మొత్తం రూ.1,008 కోట్ల రుణాలను స్టేట్ బ్యాంక్ జాబితా చేసింది.
ఈ జాబితాలో మొత్తం రూ.8,668 కోట్లతో 21 పవర్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అనిల్ అంబానీకి చెందిన విదర్భ ఇండస్ట్రీస్ పవర్ అత్యధికంగా రూ.2,253 కోట్ల రుణాన్ని కలిగి ఉంది. ఇదే రంగంలోని వీసా పవర్, షిర్పూర్ పవర్, కోస్టల్ ఎనర్జెన్, ILFS తమిళనాడు పవర్, రీజెన్ పవర్‌టెక్, సురానా పవర్, మహేశ్వర్ హైడల్ పవర్ కార్పొరేషన్ కంపెనీలు ఉన్నాయి.
అతిపెద్ద రిస్కీ రుణ ఖాతాల్లో అబాన్ హోల్డింగ్స్ రూ.2,630 కోట్లు, ఎబిజి షిప్‌యార్డ్ రూ.1,757 కోట్లు, వరుణ్ రిసోర్సెస్ రూ.1,558 కోట్లు, పుంజ్ లాయిడ్ రూ.1,516 కోట్లు, నాగార్జున ఆయిల్ కార్పొరేషన్ రూ.1,360 కోట్లు, పిసి.జ్యువెలర్స్ రూ.1,002 కోట్లతో స్టేట్ బ్యాంకును ఆందోళనకు గురిచేస్తున్నాయి. అందుకే బ్యాంక్ ఈ రుణాలను అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీలకు కంపెనీలకు విక్రయించాలని చూస్తోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications