For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI: ఖాతాదారులకు శుభవార్త చెప్పిన ఎస్బీఐ.. త్వరలో ఆ సేవలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడి..

|

దేశంలోనే అతి పెద్ద బ్యాంకుగా ఉన్న ఎస్బీఐ తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఖాతాదారలు సౌకర్యార్థం అతి త్వరలో వాట్సాప్‌ ద్వారా బ్యాంకింగ్‌ సేవల్ని అందుబాటులో తెస్తున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం చాలా మందికి ఎస్‌బీఐ బ్యాంకింగ్‌ సేవల్ని మరింత సులభతరం చేయనుంది.జులై1న జరిగిన వర్చువల్‌ మీటింగ్‌లో ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేష్‌ ఖారా ఈ విషయం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఎస్‌బీఐ పలు కొత్త సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.వాటిలో ముఖ్యంగా వాట్సాప్‌లో ఎస్‌బీఐ బ్యాంకింగ్‌ సేవలు ఉంటాయని తెలిపారు. అగ్రిగేటర్లు, కార్పొరేట్ ఖాతాదారులకు API (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్) బ్యాంకింగ్‌ను ప్రారంభించేందుకు SBI సిద్ధంగా ఉందన్నారు. అయితే వాట్సాప్ ద్వారా ఎలాంటి సేవలు అందిస్తారో కచ్చితంగా చెప్పలేదు.

ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు SBI కార్డ్ WhatsApp కనెక్ట్ పేరుతో ప్లాట్‌ఫారమ్ ద్వారా WhatsApp ఆధారిత సేవలను అందిస్తుంది. దీని ద్వారా, SBI క్రెడిట్ కార్డ్ కస్టమర్లు తమ ఖాతా సారాంశం, రివార్డ్ పాయింట్లు, బకాయి బ్యాలెన్స్, కార్డ్ చెల్లింపులు వివరాలు వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు. వాట్సాప్ సేవల కోసం కార్డ్ హోల్డర్‌లు 9004022022కు 'OPTIN' అనే WhatsApp సందేశాన్ని పంపాలి. లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 08080945040కి మిస్డ్ కాల్ ఇవ్వవచ్.

SBI to introduce WhatsApp banking service soon

HDFC బ్యాంక్, యెస్ బ్యాంక్, ICICI బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యాక్సిస్ మరియు IDFC ఫస్ట్, ఇతర బ్యాంకులు ప్రస్తుతం WhatsApp బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నారు.

English summary

SBI: ఖాతాదారులకు శుభవార్త చెప్పిన ఎస్బీఐ.. త్వరలో ఆ సేవలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడి.. | SBI to introduce WhatsApp banking service soon

India’s largest public sector lender, State Bank of India or SBI is soon going to launch banking services on WhatsApp.
Story first published: Saturday, July 2, 2022, 17:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X