ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకు వస్తోంది. కొత్త సంవత్సరం (2020)లో కస్టమర్లు సరికొత్త పద్ధతిలో మనీ విత్ డ్రా చేసుకోవచ్చు. ఇప్పటికే యోనో యాప్ ద్వారా ఏటీఎంకు వెళ్లి మనీ విత్ డ్రా చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఇప్పుడు ఏటీఎం క్యాష్ విత్ డ్రా సేవలను మరింత సులభతరం చేయాలని నిర్ణయించింది.

OTP ఆధారిత క్యాష్ విత్ డ్రా
SBI వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) ఆధారంగా క్యాష్ విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పించనుంది. తద్వారా అనధికార ట్రాన్సాక్షన్స్ నుంచి అలర్ట్ చేయడం ద్వారా కస్టమర్ల అకౌంట్స్‌కు మరింత భద్రత కల్పించనుంది. ఏటీఎంలలో కస్టమర్ల ట్రాన్సాక్షన్సు మరింత సురక్షితం అవుతాయి.

1 జనవరి 2020 నుంచి ప్రారంభం
OTP ఆధారిత క్యాష్ విత్ డ్రా సిస్టం 1 జనవరి 2020 నుంచి దేశవ్యాప్తంగా అన్ని ఎస్బీఐ ఎటీఎంలలో ప్రారంభం కానుంది. OTP ఆధారిత క్యాష్ విత్ డ్రా సేవలను తీసుకు వస్తున్నామని, మోసపూరిత ట్రాన్సాక్షన్స్‌ను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, అన్ని ఎస్బీఐ ఏటీఎంలలో వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని ఎస్బీఐ ట్వీట్ చేసింది.

రూ.10 వేలకు పైన.. రాత్రి 8 నుంచి ఉదయం 8 వరకు
అయితే OTP ఆధారిత క్యాష్ విత్ డ్రా సేవలు అన్ని ట్రాన్సాక్షన్స్‌కు వర్తించదు. రూ.10,000 ఆ పైన విలువ కలిగిన ట్రాన్సాక్షన్స్‌కు మాత్రమే ఉంటుంది. ఇది కూడా సాయంత్రం 8 నుంచి ఉదయం 8 వరకు అందుబాటులో ఉంటుంది.

ఇలా మోసపూరిత ట్రాన్సాక్షన్లకు చెక్
ఎస్బీఐ ఖాతాదారులు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవాలనుకుంటే అప్పుడు బ్యాంకు అకౌంటుతో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్‌కు OTP వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే డబ్బులు తీసుకోవడానికి వీలు అవుతుంది. దీంతో మోసపూరిత ట్రాన్సాక్షన్స్‌కు చెక్ చెప్పవచ్చు.

ఇతర బ్యాంకుల్లో తీసినప్పుడు పని చేయదు..
మీరు SBI ఏటీఎం నుంచి క్యాష్ విత్ డ్రా చేసినప్పుడు మాత్రమే ఈ OTP ఆధారిత ట్రాన్సాక్షన్ సౌకర్యం ఉంటుంది. ఇతర బ్యాంకు ఏటీఎంలలో తీస్తే ఇది వర్తించదు. ఈ మేరకు ఎస్బీఐ గురువారం రాత్రి ట్వీట్ చేసింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications