ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. సీనియర్ సిటిజన్ల కోసం అందుబాటులోకి తెచ్చిన స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం ఎస్బీఐ వీ-కేర్ రిటైల్ టర్మ్ డిపాజిట్ గడువును వచ్చే జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో వృద్ధుల కోసం గత ఏడాది మే నెలలో ప్రత్యేకంగా టర్మ్ డిపాజిట్ స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. తొలుత ఈ గడువును సెప్టెంబర్ వరకు పొడిగించింది. ఆ తర్వాత డిసెంబర్ వరకు, ఆ తర్వాత మార్చి 31 వరకు వెసులుబాటు కల్పించింది. ఈ గడువు ముగుస్తుండటంతో మరో మూడు నెలలు అవకాశమిచ్చింది.

ఇదీ సీనియర్ సిటిజన్స్ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం
ఎస్బీఐ గత ఏడాది మే నెలలో ఎస్బీఐ సీనియర్ సిటిజన్స్ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం ఎస్బీఐ వీ-కేర్‌ను ప్రారంభించింది. 80 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటును అందిస్తోంది. ప్రస్తుతం ఎస్బీఐ సాధారణ కస్టమర్లకు FD పైన అయిదేళ్ల కాలపరిమితికి 5.4 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. సీనియర్ సిటిజన్స్‌కు స్పెషల్ ఎఫ్‌డీ స్కీం కింద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 6.20 శాతం వడ్డీ రేటు అందిస్తోంది.

కస్టమర్లకు వడ్డీ రేటు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. సాధారణ కస్టమర్లకు 7 రోజుల నుండి పదేళ్ల కాలపరిమితికి ఎస్బీఐ FD వడ్డీ రేట్లు 2.9 శాతం నుండి 5.4 శాతంగా ఉన్నాయి. సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్స్ అదనం. ఎస్బీఐ జనవరి 8న FD రేట్లను సవరించింది.

HDFC సైతం
ఇటీవల ప్రయివేటురంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా సీనియర్ సిటిజన్స్ కోసం తీసుకు వచ్చిన స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీంను జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది. ఈ స్కీంను ఇలా పొడిగించడం ఇది మూడోసారి. సీనియర్ సిటిజన్ కేర్ FD స్కీంను మే 2020న లాంచ్ చేసింది ఈ ప్రయివేటురంగ దిగ్గజం. కరోనా మహమ్మారి నేపథ్యంలో వడ్డీరేట్లు భారీగా పడిపోతున్న సమయంలో దీనిని తీసుకువచ్చింది. ఈ స్పెషల్ FD స్కీం పైన సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ రేట్లను అందిస్తోంది. ఈ స్కీం కింద అదనంగా 75 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటును అందిస్తోంది. FDలపై 6.25 శాతంగా ఉంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications