For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Q4 ఫలితాల ఎఫెక్ట్, ఎస్బీఐ కార్డ్స్ ఐపీవో అండ: షేర్ 8% జంప్

|

ప్రభుత్వరంగ దిగ్గజ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహక ఫలితాలు సాధించింది. జనవరి-మార్చి క్వార్టర్ 4లో ఎస్బీఐ నికర లాభం రూ.3,581 కోట్లుగా ఉంది. స్టాండలోన్ ప్రాతిపదన ఒక క్వార్టర్‌లో బ్యాంకు అత్యధిక లాభాలు ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఇదే క్వార్టర్‌లో రూ.838 కోట్లు ఉండగా, ఇది 327 శాతం వృద్ధి నమోదు చేసింది. తాజా క్వార్టర్‌లో రూ.2,731 కోట్ల మేర లభించిన వన్ టైమ్ లాభం బ్యాంకుకు అండగా నిలిచింది.

ఐపీవో ద్వారా అనుబంధ సంస్థ ఎస్బీఐ కార్డ్స్‌లో ఎస్బీఐ వాటాని విక్రయించడం ద్వారా పై నిధులు సమకూరాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంకు నికర లాభం రూ.6,910 కోట్లుగా ఉంది. క్వార్టర్4లో రూ.13,495 కోట్లమేర ప్రొవిజన్స్ చేపట్టింది. నికర వడ్డీ ఆదాయం నామమాత్రం తగ్గి రూ.22,954 కోట్లుగా ఉంది. స్థూల మొండిబకాయిలు 6.94% నుంచి 6.15% తగ్గాయి. నికర ఎన్పీఏలు 2.23 శాతానికి చేరుకున్నాయి.

ఆర్థికమాంద్యంలోకి ప్రపంచం, జాగ్రత్త పడుతున్న ఇండియన్ ఐటీ కంపెనీలు!ఆర్థికమాంద్యంలోకి ప్రపంచం, జాగ్రత్త పడుతున్న ఇండియన్ ఐటీ కంపెనీలు!

SBI share price jumps 3 percent ahead of its March quarter results

ఎస్బీఐ ఫలితాల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో ఎస్బీఐ 8.73% పెరిగింది. రూ.189.25 వద్ద ముగిసింది. ఓ సమయంలో రూ.190 వరకు ఎగిసింది. క్వార్టర్ 4లో మారటోరియానికి 21.8 శాతం మంది కస్టమర్లు మొగ్గు చూపినట్లు ఎస్బీఐ తెలిపింది. అన్ని కాల వ్యవధి రుణాల కస్టమర్లలో 23 శాతం మంది మారటోరియంకు ఆసక్తి చూపించలేదని తెలిపింది.

English summary

Q4 ఫలితాల ఎఫెక్ట్, ఎస్బీఐ కార్డ్స్ ఐపీవో అండ: షేర్ 8% జంప్ | SBI share price jumps 3 percent ahead of its March quarter results

State Bank of India (SBI) share price was up 3 percent in the morning trade on June 5 ahead of the bank's Q4 results.
Story first published: Friday, June 5, 2020, 17:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X