కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు బ్యాంకులు అనేక చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ ఉద్యోగులకు ఎక్కడి నుండి అయినా పని చేసే వెసులుబాటును కల్పించింది. ఉద్యోగులు, కస్టమర్ల రక్షణ కోసం పలుచర్యలు చేపడుతోంది. బ్యాంకుల్లో అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
బ్యాంకు ఖాతాదారులు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవడంతో పాటు శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. రద్దీ అధికంగా ఉండే శాఖల్లో థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేశారు. సిబ్బందికి పీపీఈ కిట్స్ సమకూర్చారు. కరోనా వ్యాప్తిస్తుండటంతో కస్టమర్లకు కూడా సూచనలు చేస్తున్నారు.

సాధ్యమైనంత వరకు ఆన్ లైన్ సేవలు ఉపయోగించుకోవాలని సూచిస్తోంది ఎస్బీఐ. తప్పనిసరి అయితేనే తమ బ్యాంకు శాఖలకి రావాలని ఖాతాదారులను కోరుతోంది. ఎస్బీఐ యోనో యాప్‌ను కూడా వినియోగించుకోవచ్చునని చెబుతోంది. బ్యాంకు బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్, ఏటీఎం కార్డులు బ్లాక్ చేయడం, కొత్త పిన్ నెంబర్ వంటి సేవలకు ప్రత్యేక మొబైల్ నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు హైదరాబాద్ సర్కిల్ చీఫ్ మేనేజర్ తెలిపారు. ఈ సేవల కోసం 09223488888కు తొలుత ఖాతా నెంబర్‌ను మెసేజ్ ద్వారా పంపి రిజిస్టర్ చేసుకోవాలన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications