Jindal Saw Stock: ప్రస్తుతం మార్కెట్లు లాంగ్ బులిష్ ప్రయాణం తర్వాత కొంత ఒడిదొడుకులను చూస్తున్నాయి. అనేక అంతర్జాతీయ కారణాలు దీనిని ప్రేరేపిస్తున్నాయి. ఈక్రమంలో ఏ కంపెనీ షేర్లను కొనాలి అని వెతుకుతున్న ఇన్వెస్టర్లకు ఎస్‌బీఐ సెక్యూరిటీస్ ఒక స్టాక్ ఐడియాతో ముందుకు వచ్చింది.
కంపెనీ బోర్డు 2:1 నిష్పత్తిలో స్టాక్ విభజనను ఆమోదించిన తర్వాత జిందాల్ సా షేర్లు గతవారం 3.33 శాతం పెరిగి 52 వారాల గరిష్ట స్థాయి రూ.710.65కి చేరుకున్నాయి. కంపెనీ పేర్కొన్న స్టాక్-స్ప్లిట్ ప్రక్రియ నవంబర్ 30, 2024 నాటికి పూర్తవుతుంది. ఈ క్రమంలో ఉక్కు తయారీ వ్యాపారంలో ఉన్న జిందాల్ సా షేర్లను కొనుగోలు చేయటానికి 5 కారణాలను ఎస్‌బీఐ సెక్యూరిటీస్ వెల్లడించింది. మెుదటగా కంపెనీ తన వివిధ పైప్ ఉత్పత్తులతో పరిశ్రమలోని ప్రధాన విభాగాల్లో జిందాల్ ఆరోగ్యవంతమైన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను కలిగి ఉందని వెల్లడించింది. మొత్తం రాబడిలో 30% కంటే ఎక్కువ ఏ ఒక్క ఉత్పత్తి తోడ్పడని వెల్ బ్యాలెన్స్డ్ రాబడి మోడల్ అని బ్రోకరేజ్ వెల్లడించింది.

ఇక జిందాల్ సా కలిగి ఉన్న ఆరోగ్యకరమైన ఆర్డర్ బుక్ షేర్ల కొనుగోలుకు రెండవ కారణంగా సూచించింది. ప్రస్తుతం కంపెనీ 1.65 బిలియన్ డాలర్ల ఆర్డర్ బుక్ కలిగి ఉన్నట్లు బ్రోకరేజ్ వెల్లడించింది. ఇక 'శాతవాహన' బిజినెస్ దృక్పథం మూడవ కారణంగా పేర్కొంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇక్కడి నుంచి గరిష్ట సామర్థ్య వినియోగంతో 2,00,000 టన్నులను సరఫరా చేయాలని కంపెనీ భావిస్తోంది. డీబోటిల్‌నెకింగ్ ద్వారా సామర్థ్యాన్ని 10 శాతం-20 శాతం పెంచాలని యోచిస్తోంది. కంపెనీ ప్రస్తుతం విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి సారించటం నాల్గవ అంశంగా ఎస్‌బీఐ సెక్యూరిటీస్ వెల్లడించింది. ఇక చివరిగా కంపెనీ బలమైన నిర్వహణ పనితీరు కొనుగోలుకు కారణంగా పేర్కొంది.
కంపెనీ తన కార్యకలాపాలను వేగవంతం చేయడం, స్థిరీకరించిన ధరల వద్ద ముడి పదార్థాలను లాక్ చేయడం వంటి కారణాల వల్ల వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు పెరిగాయి. దీంతో జిందాల్ సా స్టాండ్‌లోన్ రుణం రూ.3,200 కోట్ల నుంచి రూ.3,900 కోట్లకు పెరిగిందని ఎస్‌బీఐ సెక్యూరిటీస్ సూచించింది. జిందాల్ సా దీర్ఘకాలిక రుణాన్ని FY26 నాటికి చెల్లించాలని భావిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం మార్కెట్ల ముగింపు సమయంలో జిందాల్ సా షేర్ల ధర ఎన్ఎస్ఈలో ఒక్కోటి రూ.690 వద్ద ఉంది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ.21,960 కోట్లుగా ఉంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications