మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో అకౌంట్ ఉందా? రిటైల్ పొదుపు ఖాతాల్లో డిపాజిట్లపై రేట్ల తగ్గింపు నవంబర్ 1వ తేదీ నుంచి వర్తిస్తుందని తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటు తగ్గింపు నేపథ్యంలో రుణాలు తీసుకునే వారికి వడ్డీ తగ్గుతోంది. అదే సమయంలో డిపాజిటర్లకు కూడా బ్యాంకులు ఇచ్చే వడ్డీ శాతం తగ్గుతోంది. రూ.1 లక్ష వరకు సేవింగ్స్ అకౌంట్స్‌పై వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. ఎస్బీఐ వద్ద తగినంత లిక్విడిటీ ఉంది. దానికి తోడు ఆర్బీఐ రెపో రేటు తగ్గిస్తోంది. దీంతో డిపాజిట్లపై ప్రభావం పడుతోంది.

సేవింగ్ డిపాజిట్స్‌పై వడ్డీ రేటు
- రూ.1 లక్ష వరకు సేవింగ్స్ డిపాజిట్స్ పైన నవంబర్ 1, 2019 నుంచి వడ్డీ రేటు 3.50 శాతం నుంచి 3.25 శాతానికి తగ్గించింది.
- ఈ ఏడాది మే నెలలో ఎస్బీఐ లార్జ్ సేవింగ్స్ డిపాజిట్స్ రేట్లను ఆర్బీఐ రెపో రేటుకు అనుసంధానించింది.
- అలాగే, సెలెక్టివ్ మెచ్యూరిటీ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును అక్టోబర్ 10వ తేదీ నుంచి కుడా తగ్గించింది.

రూ.1 లక్షకు పైగా సేవింగ్ డిపాజిట్‌పై...
- రూ.1 లక్షకు పైగా ఉన్న సేవింగ్ డిపాజిట్ అకౌంట్స్ పైన వడ్డీ రేటు ఇప్పటి వరకు 3 శాతం ఉంది. ఇందులో ఎలాంటి మార్పు చేయలేదు ఎస్బీఐ.
- లార్జ్ బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్స్‌కు రెపో రేటును లింక్ చేసిన తొలి బ్యాంకు ఎస్బీఐ.

వారికి ఉచితం..
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 టీటీఏ కింద సంవత్సరానికి రూ.10,000 వరకు పొదుపు ఖాతా వడ్డీ పన్ను ఉచితం. సీనియర్ సిటిజన్లకు ఇది రూ.50,000 వరకు వర్తిస్తుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications