SBI FD Rates Hike: పండుగకు కొద్ది రోజుల ముందు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు మంచి శుభవార్త తెలిపింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో డబ్బును సేవ్ చేసుకోవాలనుకునే వారికోసం అత్యధికంగా 80 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు వెల్లడించింది.

రేట్ల పెంపు ఇలా..
దిగ్గజ ప్రభుత్వ బ్యాంక్ FD కస్టమర్లకు 25 బేసిస్ పాయింట్ల నుంచి గరిష్ఠంగా 80 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్ల పెంపును అందిస్తోంది. కొత్తగా మార్పు చేసిన రేట్లు అక్టోబర్ 22 నుంచి రూ.2 కోట్ల కంటే తక్కువ FDలపై వర్తిస్తాయని స్పష్టం చేసింది. 211 రోజుల నుంచి ఏడాది లోపు కాలవ్యవధిపై అత్యధికంగా 80 బేసిస్ పాయింట్లు పెంచింది. 180-210 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే FDలపై వడ్డీ రేట్లను 60 బేసిస్ పాయింట్లు పెంచి 5.25%గా ప్రకటించింది. 2 ఏళ్ల నుంచి 3 సంవత్సరాల లోపు కాల వ్యవధికి చెల్లించే రేటును 6.25%కి పెంచబడింది.

6 నెలల కాలానికి..
46- 179 రోజుల పదవీకాలానికి వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 4.50%గా నిర్ణయించింది. ఇదే విధంగా 3 నుంచి 5 సంవత్సరాల కాలవ్యవధిలో పెట్టుబడులపై 30 బేసిస్ పాయింట్లు పెంచి 6.10%గా ఉంది. 5-10 సంవత్సరాల డిపాజిట్లపై 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.10% వడ్డీ అందిస్తోంది. ఇక 7-45 రోజుల డిపాజిట్లపై 3 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నట్లు వెల్లడించింది.

సీనియర్ సిటిజన్ల రేట్లు ఇలా..
5-10 ఏళ్ల కాలానికి చేసే డిపాజిట్లపై గరిష్ఠంగా బ్యాంక్ 6.90% వడ్డీ రేటును అందిస్తోంది. 211 రోజుల నుంచి ఏడాది లోపు చేసే డిపాజిట్లకు 80 బేసిస్ పాయింట్లు పెంచి 6% వడ్డీని ఆఫర్ చేస్తోంది. 3-5 ఏళ్ల కాలానికి 6.60% వడ్డీని అందించాలని బ్యాంక్ నిర్ణయించింది. ఇదే క్రమంలో 46 రోజుల నుంచి 179 రోజుల కాలానికి 5 శాతం వడ్డీని చెల్లిస్తోంది. ఇక చివరిగా 7- 45 రోజుల వ్యవధిలోని డిపాజిట్లకు గాను 3.50% వద్ద రేటును అందిస్తోంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications