SBI Q2 Results: దేశంలో ప్రభుత్వ యాజమాన్యంలో అతిపెద్ద రుణదాతగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేడు తన సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఈ క్రమంలో మంచి లాభాలను నమోదు చేసింది.
సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసిక కాలానికి స్టేట్ బ్యాంక్ రూ.14,330 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో నమోదైన లాభం కంటే 8 శాతం అధికం. ఇదే సమయంలో నికర వడ్డీ ఆదాయం 12.3 శాతం పెరిగి రూ.39,500 కోట్లుగా ఉంది. అలాగే మెుత్తం త్రైమాసిక ఆదాయం 26.4 శాతం వృద్ధి చెంది 1.12 లక్షల కోట్లుగా నిలిచింది. త్రైమాసిక ప్రాతపదికన ఆస్తుల నాణ్యత మెరుగుపడింది.

సెప్టెంబర్ చివరి నాటికి నికర నిరర్థక ఆస్తుల నిష్పత్తి 0.64 శాతంగా ఉంది. ఇది ఏడాది క్రితం 0.80 శాతం, త్రైమాసికం క్రితం 0.71 శాతంగా నమోదైంది. సెప్టెంబర్ చివరి నాటికి స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 2.55 శాతంగా, ఏడాది క్రితం 3.52 శాతం, త్రైమాసికం క్రితం 2.76 శాతంగా నమోదైంది. ఈ త్రైమాసికంలో దేశీయ నికర వడ్డీ మార్జిన్(NIM) 12 bps తగ్గి 3.43 శాతానికి చేరుకుంది. అయితే సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల మార్జిన్‌లు 6 బేసిస్ పాయింట్ల మేర పెరిగి 3.45 శాతానికి చేరుకున్నాయి.
సెప్టెంబర్ త్రైమాసికంలో దేశీయ అడ్వాన్సులు 13.2 శాతం పెరగడంతో.. క్రెడిట్ వృద్ధి 12.39 శాతం పెరిగింది. అలాగే దేశీయ అడ్వాన్సుల్లో వృద్ధి SME రుణాల ద్వారా 23 శాతం, రిటైల్ వ్యక్తిగత రుణాల్లో 16 శాతం సాధించింది. అలాగే విదేశీ శాఖల్లో అడ్వాన్సులు రూ.5 లక్షల కోట్లు దాటాయి. వ్యవసాయ, కార్పొరేట్ రుణాలు వరుసగా 14.76 శాతం, 6.62 శాతం వృద్ధిని నమోదు చేశాయి. మొత్తం బ్యాంక్ డిపాజిట్లు సంవత్సరానికి 11.91% పెరగగా.. అందులో CASA డిపాజిట్ 4.91 శాతం పెరిగాయి. 30 సెప్టెంబర్ 2023 నాటికి CASA నిష్పత్తి 41.88 శాతంగా ఉంది.


Click it and Unblock the Notifications