For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కస్టమర్లకు SBI హోంలోన్ బంపరాఫర్, వడ్డీ రేటు 6.7% మాత్రమే

|

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గించినట్లు శనివారం ప్రకటించింది. రూ.30లక్షల లోపు రుణాలపై వార్షిక వడ్డీని 6.70 శాతంగా నిర్ణయించినట్లు తెలిపింది. రూ.30 లక్షల నుండి రూ.75 లక్షల లోపు రుణాలపై 6.95 శాతం, రూ.75 లక్షలకు మించిన రుణానికి 7.05 శాతం వడ్డీ ఉంటుందని పేర్కొంది. ఇటీవల ఎస్బీఐ వడ్డీ రేట్లు పెరిగిన విషయం తెలిసిందే. అంతకుముందు మార్చి నెలలో వడ్డీ రేట్లపై ఆఫర్ ఇచ్చింది. ఆ తర్వాత ఏప్రిల్ నెల నుండి వడ్డీ రేట్లను పెంచింది. ఇప్పుడు స్వల్పంగా తగ్గించింది.

ఆఫర్ ఇచ్చి, పెంచి మళ్లీ తగ్గింపు

ఆఫర్ ఇచ్చి, పెంచి మళ్లీ తగ్గింపు

తాము తీసుకున్న ఈ నిర్ణయంతో EMI భారం గణనీయంగా తగ్గుతుందని, సరసమైన ధరల్లో లభించే గృహాల రుణాలకు కస్టమర్ల నుండి పెద్ద ఎత్తున డిమాండ్ కూడా వస్తుందని ఆశిస్తున్నామని ఎస్బీఐ రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ ఎండీ సీఎస్ శెట్టి అన్నారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు గృహ రుణాలపై వడ్డీరేట్లను ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా 6.7 శాతంగా ఆఫర్ ప్రకటించింది. ఏప్రిల్ 1వ తేదీ నుండి 6.95 శాతానికి సవరించింది. నెల రోజుల తర్వాత మళ్లీ 6.7 శాతానికే సవరించింది.

రూ.30 లక్షల వరకు రుణాలపై

రూ.30 లక్షల వరకు రుణాలపై

రూ.30 లక్షల వరకు రుణాలపై 6.7 శాతం వడ్డీని అందిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. రుణాలు తీసుకునేవారు మహిళలు అయితే మరో 0.05 శాతం తగ్గి 6.65 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. రూ.30 లక్షల నుండి 75 లక్షల వరకు ఉండే రుణాలపై వడ్డీరేటు 6.95 శాతంగా ఉంటుంది. రూ.75 లక్షలకు పైగా తీసుకునే రుణాలపై 7.05 శాతం వడ్డీని వసూలు చేస్తామని తెలిపింది.

యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే..

యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే..

SBI ఖాతాదారులు యోనో యాప్ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే వడ్డీరేటుపై అదనంగా 5 బేసిస్ పాయింట్ల రాయితీ వస్తుందని బ్యాంక్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. దేశీయ గృహ రుణాల మార్కెట్లో ఎస్బీఐ వాటానే 34 శాతానికి పైగా ఉంది. బ్యాంకు హోమ్ లోన్ పోర్ట్‌ఫోలియో రూ.5 లక్షల కోట్ల మార్కును క్రాస్ చేసింది. ఎస్బీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో మరిన్ని బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ సంస్థలు తమ హోమ్ లోన్స్ పైన వడ్డీరేట్లను తగ్గించే వీలుందని భావిస్తున్నారు.

English summary

కస్టమర్లకు SBI హోంలోన్ బంపరాఫర్, వడ్డీ రేటు 6.7% మాత్రమే | SBI reduces home loan interest rates, Check the latest rates

State Bank of India (SBI) on Saturday announced that it has slashed its home loan interest rates. Now, customers can get home loans at an interest rate starting from 6.7% per annum for loans up to Rs 30 lakh. For loans above Rs 30 lakh to Rs 75 lakh, the interest rate is fixed at 6.95%.
Story first published: Sunday, May 2, 2021, 11:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X