ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటు తగ్గిస్తుందని అందరూ భావించారు. కానీ యథాతథంగా ఉంచింది. దీంతో ఏ బ్యాంకు వడ్డీ రేట్లలోను దాదాపు మార్పు లేదు. తాజాగా, SBI మాత్రం కస్టమర్లకు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటును తగ్గించింది.

10 బేసిస్ పాయింట్లు తగ్గిన SBI
SBI ఎంసీఎల్ఆర్‌ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ తగ్గుదల డిసెంబర్ 10 (మంగళవారం) నుంచి అమలులోకి వస్తుందని పేర్కొంది. ఈ ఏడాదిలో ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ రేట్లు తగ్గించడం వరుసగా ఇది ఎనిమిదోసారి. దీంతో ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ ఏడాదికి 8 శాతం నుంచి ఏడాదికి 7.90 శాతానికి తగ్గింది. ఇది డిసెంబర్ 10 నుంచి అమలవుతుంది.

మిగతా ఎంసీఎల్ఆర్‌లో మార్పు లేదు
మిగతా ఎంసీఎల్ఆర్ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ఓవర్ నైట్, నెల రోజుల కాల పరిమితిపై ఎంసీఎల్ఆర్ 7.95 శాతంగానే ఉంది. అలాగే మూడు నెలల కాలపరిమితిపై 7.70 శాతం, ఆరు నెలల కాలపరిమితిపై 7.85 శాతం, రెండేళ్ల కాలపరిమితిపై 8.10 శాతం, మూడేళ్ల కాల పరిమితిపై 8.20 శాతం ఉంది. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించకపోయినప్పటికీ ఎస్బీఐ MCLRను తగ్గించడం గమనార్హం.

అందుకే తగ్గించాం
తమ కస్టమర్లకు ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఏడాది MCLR రేటును తగ్గించినట్లు SBI తెలిపింది. 10 బేసిస్ పాయింట్ల తగ్గింపుతో MCRL రేటు ఇప్పుడు ఎనిమిది శాతం నుంచి 7.9 శాతానికి దిగి వచ్చిందని పేర్కొంది. MCLR తగ్గింపుతో రుణగ్రహీతలకు ప్రయోజనం కలగనుంది. హోమ్ లోన్స్ పైన వడ్డీ రేటు దిగి వస్తుంది. దీంతో కొత్తగా రుణం తీసుకోవాలనుకునే వారికి ఇది గుడ్ న్యూస్. లోన్ తీసుకున్న వారికి కూడా ప్రయోజనం ఉండొచ్చు. వీరి ఈఎంఐ భారం తగ్గొచ్చు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications