SBI News: చరిత్ర సృష్టించిన బ్యాంకింగ్ దిగ్గజం.. పండగ చేసుకుంటున్న షేర్ హోల్డర్స్
Market cap: దేశీయ బ్యాంకింగ్ మరియు ఆర్థిక రంగాల్లో ప్రభుత్వ యాజమాన్యంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రారాజుగా వెలుగొందుతోంది. డిసెంబర్ తో ముగిసిన మూడవ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. దీంతో కొత్త రికార్డును సెట్ చేసింది.
గత త్రైమాసికంలో SBI నికర లాభం 35 శాతం పడిపోయి 9 వేల 164 కోట్లకు చేరుకున్నట్లు ఫిబ్రవరి 3న సంస్థ ప్రకటించింది. నాలుగురోజులు తిరిగేసరికి నాలుగు శాతం పెరిగి ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి 675.70ని తాకి ఆశ్చర్య పరిచింది. దీంతో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా 6 లక్షల కోట్ల మార్కును దాటింది.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తర్వాత ఈ మైలురాయిని సాధించిన రెండవ ప్రభుత్వ రంగ సంస్థ (PSU)గా SBI చరిత్ర సృష్టించింది. ఇక స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) వెబ్‌సైట్ ప్రకారం 6 లక్షల కంటే ఎక్కువ మార్కెట్ క్యాప్ కలిగిన ఎనిమిది కంపెనీల్లో ఒకటిగా స్థానం సంపాదించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా 19.32 లక్షల కోట్లు, TCS 15.12 లక్షల కోట్లు మరియు HDFC బ్యాంక్ 10.96 లక్షల కోట్లతో టాప్ 3 స్థానాల్లో ఉన్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం లక్షా 18 వేల 193 కోట్లకు పెరిగినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. గతేడాది ఇదే సమయానికి ఆదాయం 98 వేల 84 కోట్లుగా ఉందని వెల్లడించింది. నికర నిరర్థక ఆస్తులు (NPAలు) కూడా ఏడాది క్రితం 0.77 శాతంతో పోలిస్తే 0.64 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. ఉద్యోగుల వేతన పెంపు సెటిల్‌మెంట్ వల్ల జీతాలు మరియు పెన్షన్‌ల కోసం అదనపు కేటాయింపులు చేయడంతో లాభం తగ్గినట్లు స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications