Employment Trend: ఉద్యోగ కల్పనపై SBI మైండ్ బ్లోయింగ్ రిపోర్ట్.. నాలుగేళ్లలో ఎంతమంది జాబ్ కొట్టారంటే..
Employment Trend: నిరుద్యోగం పెరిగిపోతుంది అని అందరి మదిలో ఉన్నమాటే. కానీ వాస్తవ గణాంకాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. గత నాలుగేళ్ల అధికారక డేటాను విశ్లేషిస్తే భారీ మొత్తంలో ఉద్యోగాల కల్పన జరిగినట్లు తెలుస్తోంది. ఏదో చిన్నా, చితకా సంస్థ చేసిన పరిశోధన కాదిది.. ఏకంగా దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBI విశ్లేషణ సారాంశం.
దేశంలో ఉద్యోగాల కల్పన గురించి SBI రీసెర్చ్ షాకింగ్ విషయం చెప్పింది. 2020-2023 మధ్య ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మరియు నేషనల్ పెన్షన్ స్కీమ్ డేటాను విశ్లేషిస్తే, విస్తుపోయే విషయాలు తెలిసినట్లు వెల్లడించింది. ఈ నాలుగేళ్లలో 5.2 కోట్ల కంటే ఎక్కువ పేరోల్ జనరేషన్ జరిగినట్లు పేర్కొంది.

గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో EPF నికర కొత్త చందాదారుల చేరిక 4.86 కోట్లుగా ఉన్నట్లు స్టేట్ బ్యాంక్ నివేదిక తెలిపింది. ఇందులో మొదటిసారి PF సభ్యత్వం తీసుకున్న వారితో పాటు తిరిగి మెంబర్ గా చేరిన వారూ ఉన్నారు. పూర్తిగా కొత్త వారిని పరిగణలోనికి తీసుకుంటే ఈ సంఖ్య 2.27 కోట్లుగా ఉన్నట్లు SBI చెప్పింది.
"FY24 Q1 EPFO పేరోల్ డేటా ట్రెండ్ చాలా ప్రోత్సాహకరంగా ఉంది" అని SBI గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ తెలిపారు. ఇప్పటికే 44 లక్షల మంది నికర కొత్త EPF చందాదారులు చేరారన్నారు. వీరిలో మొదటిసారి ఉద్యోగులు 19.2 లక్షలని పేర్కొన్నారు. ఇదే ట్రెండ్ ఏడాది మొత్తం కొనసాగితే.. FY24లో నికర కొత్త పేరోల్ 160 లక్షల మార్కును దాటుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications