SBI Q4 Results: 80 శాతం పెరిగిన నెట్ ప్రాఫిట్

ప్రభుత్వరంగ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్(SBI) భారీ లాభాలు ప్రకటించింది. నేడు ఆ బ్యాంకు 2020-21 నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. బ్యాంకింగ్ వ్యాప్యారంలో మొత్తం రూ.6,450 కోట్ల నికర లాభం ప్రకటించింది. ముఖ్యంగా ఎన్పీఏల మీద ప్రొవిజన్స్ తగ్గడం ఎస్బీఐకి కలిసి వచ్చింది. ఈసారి ప్రొవిజన్స్ అండ్‌ కంటెజెన్సీ ఫండ్‌కు కేటాయింపులు 18.11 శాతం మేర తగ్గాయి.

గత ఏడాది ఇదే సీజన్‌లో ప్రొవిజన్స్ కింద రూ.13,495 కోట్లు కేటాయించగా ఈసారి అది రూ.9,914 కోట్ల కేటాయింపు జరిగింది. ఈ త్రైమాసికంలో పన్ను చెల్లింపులకు ముందు లాభం రూ.8,649 కోట్లుగా కాగా, గత ఏడాది రూ.4,970 కోట్లుగా ఉంది. ప్రొవిజన్స్ ఏర్పాటుకు ముందు లాభం రూ.19,700 కోట్లుగా ఉంది. గత ఏడాదితో 6.69 శాతం లాభం పెరిగింది.

SBI Q4 Results: Net Profit Rises 80 percent to Rs 6,451 Crore

బ్యాంక్ నిర్వహణ లాభాల్లో 13.66 శాతం వృద్ధి కనబరిచింది. కంపెనీకి వడ్డీలపై లభించే ఆదాయం పెరిగింది. ఇది రూ.27,067 కోట్లకు చేరుకుంది. మార్చి త్రైమాసికంలో కరోనా నిబంధనలు తొలగిపోవడంతో రుణ చెల్లింపుదారులకు కొంత ఊరట లభించిందని, దీంతోపాటు కోర్టు ఆదేశాల మేరకు రూ.830 కోట్ల మేరకు వడ్డీ సొమ్మును వాపస్ చేశామని ఎస్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+