SBI Q3 Result: ప్రభుత్వ రంగంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన పనితీరుతో మరోసారి దేశప్రజలను, ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచింది. ఇటీవల కొంత కాలంగా దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు అనే తేడా లేకుండా అన్ని మంచి పనితీరును కనబరుస్తున్నాయి. తాజా ఫలితాలతో ఇన్వెస్టర్లు సంతోషంగా ఉన్నారు.

కంపెనీ ఫలితాలు..
డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి బ్యాంక్ నికర లాభం దాదాపు 68 శాతం పెరిగింది. దీంతో ప్రభుత్వ బ్యాంక్ రూ.14,205 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఇదే క్రమంలో కంపెనీ వడ్డీ ఆదాయం భారీగా పెరిగి రూ.86,616 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో వడ్డీ ఆదాయం కేవలం రూ.69,678 కోట్లుగా ఉంది. RBI వడ్డీ రేట్లను ఇటీవల భారీగా పెరగటం దీనికి కారణంగా ప్రధాన నిలిచింది.

మరో రెండేళ్లు..
ప్రస్తుతం బ్యాంక్ MDగా ఉన్న చల్లా శ్రీనివాసులు శెట్టి పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం జనవరి 20, 2023 నుంచి రెండేళ్ల పాటు పొడిగించింది. దీంతో ఆయన మరో రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. బ్రోకరేజ్ సంస్థలు త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.13,360కోట్లుగా అంచనా వేశాయి.

తగ్గిన మెుండి బకాయిలు..
డిసెంబర్ త్రైమాసికంలో మొండి బకాయిలకు కేటాయింపులు 49 శాతం తగ్గి రూ.1,586 కోట్లకు చేరుకున్నాయి. ఇదే సమయంలో బ్యాంక్ లోన్ బుక్ 17.60 శాతం పెరిగింది. పైగా బ్యాంక్ ఇటీవల రిటైల్ రుణాలపై దృష్టి సారించటంతో పెరుగుదలకు కారణంగా నిలిచింది. రానున్న త్రైమాసికంలో క్రెడిట్ వృద్ధిపై ఛైర్మన్ దినేష్ ఖరా ఆశాజనకంగా ఉన్నారు. స్థూల మొండి బకాయిల నిష్పత్తి ఏడాది క్రితం 4.50 శాతం నుంచి 3.14 శాతానికి తగ్గాయి.

స్టాక్ ధర..
స్టేట్ బ్యాంక్ స్టాక్ ధర ఈరోజు ఉదయం 11.56 గంటల సమయంలో ఎన్ఎస్ఈలో రూ.546.20 వద్ద ట్రేడ్ అవుతోంది. ఏడాది ప్రాతిపదికన స్టాక్ ధర 10 శాతానికి పైగా తక్కువలో ట్రేడవుతోంది. ఈ క్రమంలో స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.629.55గా ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.425 వద్ద ఉంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.4.87 లక్షల కోట్లుగా ఉంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications