ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2019-20 ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్‌కు గాను భారీ లాభాలు గడించింది. శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో ఏకంగా 41.17 శాతం స్టాండలోన్ ప్రాఫిట్‌తో రూ.5,583.36 కోట్ల లాభాలు ఆర్జించింది. ఈ బ్యాంకుకు ఈ ప్రాఫిట్ రికార్డ్. ఓ క్వార్టర్లో నికర లాభంలో ఇంత ఎక్కువ వృద్ధి కావడం ఎస్బీఐ చరిత్రలో తొలిసారి.
ఎస్బీఐ స్థూల ఎన్పీఏలు 2018 డిసెంబర్ క్వార్టర్ నాటికి 8.71 శాతంగా ఉండగా, 2019 డిసెంబర్ నాటికి 6.94 శాతానికి తగ్గిపోయాయి. నికర నిరర్థక ఆస్తులు 3.95 శాతం నుంచి 2.65 శాతానికి తగ్గాయి. మొండి బకాయిల ప్రొవిజన్లు రూ.13,970 నుంచి రూ.8,193కు తగ్గాయి. 201 9-20 ఆర్థిక సంవత్సరంలోనే అంతకుముందు క్వార్టర్‌లో 7.19 శాతంగా నమోదయింది. నెట్ ఇంటరెస్ట్ ఇన్‌కం (NII) 22.42 శాతం పెరిగి రూ.27,778.79 కోట్లుగా నమోదయింది.

సమీక్ష త్రైమాసికానికి బ్యాంకు ఏకీకృత ఆదాయం రూ.95,384.28 కోట్లకు పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరం అక్టోబర్ - డిసెంబర్ క్వార్టర్‌లో ఈ ఆదాయం రూ.84,390.14 కోట్లుగా నమోదయింది. స్టాండలోన్ ప్రాతిపదికన బ్యాంకు ఆదాయం రూ.76,797.91 కోట్లుగా ఉంది.
ఎస్బీఐ క్వార్టర్ 3 ఫలితాల నేపథ్యంలో శుక్రవారం మార్కెట్లలో బ్యాంకు షేర్లు జోరు కొనసాగించాయి. మధ్యాహ్నం సమయానికి ఏకంగా రూ.9.75 లేదా 3.14 శాతం పెరిగి షేర్ రూ.320.45 వద్ద కొనసాగింది. మార్కెట్లు క్లోజ్ అయ్యే సమయానికి ఈ షేర్ ధర రూ.7.40 (2.38%) లాభంతో 318.10 ముగిసింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications