ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో అదరగొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన బ్యాంకు నికర లాభం 55 శాతం వృద్ధితో రూ.6,504 కోట్లకు పెరిగింది. ఎన్పీఏలు తగ్గడం ఇందుకు ఉపయోగపడింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో లాభం రూ.4,189.34 కోట్లుగా నమోదయింది. వడ్డీ, వడ్డీయేతర ఆదాయం కూడా భారీ లాభాలకు ఉపకరించాయి. 2008 తర్వాత ఒక త్రైమాసికంలో ఇంత భారీస్థాయిలో లాభాలు ఆర్జించడం ఇదే మొదటిసారి.
గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే స్థూల మొండి బకాయిలు (NPA) 5.44 శాతం నుండి 5.32 శాతానికి, నికర ఎన్పీఏలు 1.86 శాతం నుండి 1.77 శాతం తగ్గాయి. దీంతో కేటాయింపుల భారం 5.88 శాతం తగ్గి రూ.12,471 కోట్లకు పడిపోయింది. రుణ నష్టాల కేటాయింపులు రూ.9420 కోట్ల నుండి రూ.5030 కోట్లకు తగ్గడం ఈ త్రైమాసికంలో కలిసి వచ్చింది. అంటే 46 శాతానికి పైగా తగ్గాయి. అలాగే, నికర వడ్డీ ఆదాయం గత ఏడాది రూ.26,642 కోట్ల నుండి రూ.27,638 కోట్లకు, వడ్డీయేతర ఆదాయం రూ.11,803 కోట్లకు పెరిగింది. వడ్డీయేతర ఆదాయం 24.28 శాతం పెరిగింది. దేశీయ వడ్డీ ఆదాయ మార్జిన్ 3.24 శాతం నుండి 3.15 శాతానికి పరిమితమైంది.

ఎస్బీఐ ఏకీకృత నికర లాభం రూ.5,203 కోట్ల నుండి 55 శాతం వృద్ధితో రూ.7539 కోట్లకు పెరిగింది. దాదాపు అన్ని అంశాల్లో బ్యాంకు మంచి పనితీరు ప్రదర్శించిందని, అందుకే 2008 తర్వాత అత్యధిక త్రైమాసిక లాభాన్ని నమోదు చేసిందని, ఆస్తుల నాణ్యత విషయంలో కూడా సంతృప్తిగా ఉన్నట్లు ఎస్బీఐ ఛైర్మన్ దినేశ్ ఖరా వెల్లడించారు. తాజాగా లాక్ డౌన్ కారణంగా రూ.15,666 కోట్లు ఒత్తిడిలోకి వెళ్లాయని, ఒక్కసారి ఆర్థిక వ్యవస్థ గాడిలో పడితే వసూలవుతాయని, SME, హోమ్ లోన్ విభాగాల రుణాలు ఒత్తిడిలోకి వెళ్లినట్లు తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.14,000 కోట్ల నుండి 15,000 కోట్ల మేరకు బకాయిలను రాబట్టుకుంటామని ఎస్బీఐ అంచనా వేస్తోంది. మొదటి త్రైమాసికంలో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ నుండి రూ.1692 కోట్లను వసూలు చేసుకున్నట్లు తెలిపింది. ఇక బ్యాంకు కేటాయింపులు 5.88 శాతం తగ్గి రూ.12,471 కోట్లకు చేరాయి. ఏడాది వ్యవధిలో మొండి బకాయిల కోసం కేటాయింపులు రూ.9420 కోట్ల నుండి 46.61 శాతం తగ్గి రూ.5029 కోట్లకు పరిమితం అయ్యాయి. రుణ వృద్ధి 5.64 శాతం, పర్సనల్ లోన్స్ 16.47 శాతం, అగ్రికల్చరల్ లోన్ 2.48 శాతం, ఎస్ఎంఈ 2.01 శాతం రాణించాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న ఫలితాలు ప్రకటించిన తర్వాత బీఎస్ఈలో ఈ స్టాక్ ఎగిసిపడింది. ఏకంగా 2.37 శాతం లాభపడి రూ.457 వద్ద ముగిసింది. అయితే నేడు మాత్రం కాస్త క్షీణించింది నిన్న ఏ మేరకు లాభపడిందో... నేడు ఆ మేరకు నష్టపోయింది. నేడు ఉదయం గం.11 సమయానికి ఎస్బీఐ స్టాక్ 2.5 శాతం లేదా రూ.11 నష్టపోయి రూ.445.75 వద్ద ట్రేడ్ అయింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications