దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రెండు కొత్త డిపాజిట్ స్కీమ్స్ లాంచ్ చేసింది. ఈ స్కీమ్స్ పేర్లు 'హర్ ఘర్ లఖపతి' అండ్ 'ఎస్బిఐ పాట్రన్స్'. ఈ విషయాన్ని ఎస్‌బీఐ శుక్రవారం స్వయంగా వెల్లడించింది. ఈ ప్లాన్‌లను కస్టమర్లకు అత్యత్తమ ఆర్థిక సౌలభ్యం ఇంకా వాల్యూ అందించడానికి రూపొందించారు. ఈ స్కీమ్స్ వల్ల కస్టమర్లకు ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయని కూడా ఎస్‌బీఐ పేర్కొంది.
'హర్ ఘర్ లఖపతి' అంటే ఏమిటి?
'హర్ ఘర్ లఖపతి' అనేది నిర్ణయించిన మొత్తంతో రికరింగ్ డిపాజిట్ (RD) స్కిం. ఇందులో కస్టమర్లు రూ. 1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేయవచ్చు. SBI ప్రకారం, ఈ స్కిం ఎక్కువ మొత్తం కోరుకునవారికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఎక్కువ సేవింగ్స్ చేయడానికి కూడా కస్టమర్లకు సహాయపడుతుంది. 'హర్ ఘర్ లఖపతి' పథకం మైనర్లకు కూడా అందిస్తున్నారు. ఎందుకంటే చిన్న వయస్సులోనే వారికీ సేవింగ్స్ అలవాటును ప్రోత్సహిస్తుంది కాబట్టి.

'SBI పాట్రన్స్' ఫీచర్లు ?
ఎస్బిఐ 'ఎస్బిఐ పాట్రన్స్' పేరుతో ప్రత్యేక టర్మ్ డిపాజిట్ పథకాన్ని కూడా ప్రారంభించింది. ఈ పథకం 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్ల కోసం తీసుకొచ్చారు. ఈ పథకంలో ఎక్కువ వడ్డీ రేట్లు ఉంటాయి. సీనియర్ సిటిజన్లకు బ్యాంక్‌తో ఉన్న సంబంధాన్ని ఈ స్కిం గుర్తిస్తుంది. 'SBI పాట్రన్స్' ప్రస్తుత ఇంకా కొత్త టర్మ్ డిపాజిట్ కస్టమర్లకు అందుబాటులో ఉంది.
ఎస్‌బీఐ ఛైర్మన్ ఏం చెప్పారు అంటే ?
ఈ రెండు పథకాలను ప్రారంభించిన సందర్భంగా SBI చైర్మన్ CS సెట్టీ మాట్లాడుతూ, 'ఆర్థిక ప్రయోజనాలను పెంచడమే కాకుండా మా కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా టార్గెట్-బేస్డ్ డిపాజిట్ ప్రొడక్ట్స్ రూపొందించడమే మా లక్ష్యం. ప్రతి కస్టమర్‌కు సాధికారత కల్పించే పరిష్కారాలను సజావుగా అందించడానికి ఇన్నోవేషన్ & టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి SBI కట్టుబడి ఉందని ఆయన అన్నారు. SBI సీనియర్ సిటిజన్లకు FD పై ప్రత్యేక వడ్డీ రేట్లను అందిస్తుంది అని అన్నారు.
వడ్డీ రేట్లు క్రింది విధంగా ఉన్నాయి:
వ్యవధి వడ్డీ రేటు (%)
7 రోజుల నుండి 45 రోజుల వరకు 4%
46 రోజుల నుండి 179 రోజుల వరకు 6%
180 రోజుల నుండి 210 రోజుల వరకు 6.75%
211 రోజుల నుండి 1 సంవత్సరం కంటే తక్కువ రోజులకి 7%
1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ రోజులకి 7.3%
2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల కంటే తక్కువ రోజులకి 7.5%
3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల కంటే తక్కువ రోజులకి 7.25%
5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు రోజులకి 7.5%.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications