పదవీ విరమణ చేసిన బ్యాంకు ఉద్యోగులకు ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ హోదాల్లో పని చేసి పదవీ విరమణ పొందిన సిబ్బంది మళ్లీ ఉద్యోగం చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది ఈ ప్రభుత్వరంగ దిగ్గజం. అంటే ఇది మాజీ ఉద్యోగులకు శుభవార్త. మాజీ ఉద్యోగులకు డోర్స్ తెరిచి వివిధ మార్గాల్లో వారిని కాంట్రాక్ట్ పైన నియమించుకుంటుంది.

ఢిల్లీ సహా వివిధ నగరాల్లో
63 సంవత్సరాల వయస్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇందుకు సంబంధించి ప్రాంతీయ ప్రధాన కార్యాలయం లేదా ఎస్బీఐ సర్కిల్ కార్యాలయాల్లో నియామక ప్రక్రియ జరుగుతుందని ఎస్బీఐ వెల్లడించింది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ సర్కిల్ పరిధిలో నియామకాలను చేపట్టిన బ్యాంకు ప్రస్తుతం హైదరాబాద్, అమరావతి, పాట్నా, ముంబై మెట్రో, మహారాష్ట్ర పరిధిలో నియామకాలు చేపట్టింది.

వీరు దరఖాస్తు చేసుకోవచ్చు
అరవై ఏళ్లకు పదవీ విరమణ చేసిన స్కేల్ 1 నుంచి స్కేల్ 5 అధికారులు ఇందుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయస్సు 63 మించరాదు. అయితే, స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన వారు లేదా డిస్మిస్ అయినవారు ఇందుకు అనర్షులు. రూ.30-40 వేల మధ్య వేతనం నిర్ణయించింది. ఏడాది కాలపరిమితితో నియామకం చేస్తున్న బ్యాంకు మరో ఏడాది కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. ఎంతమందిని తీసుకుంటారనేది తెలియనప్పటికీ 500 మందిని తీసుకునే అవకాశం ఉంది.

ఆ త్రవాత వారికి ఛాన్స్
డిజిటల్ ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్, ఎఫ్ఐఎంఎం నెట్ వర్క్, ఎనీ టైమ్ బ్యాంకింగ్, చానల్ మేనేజర్స్, సూపర్ వైజర్స్, బిజినెస్ కరస్పాండెంట్ ఫెసిలిటేటర్స్ వంటి వివిధ ఖాళీలు ఉన్నాయి. ఎస్బీఐ సర్కిల్స్ స్థానిక అవసరాలకు అనుగుణంగా ఈ నియామకాలు చేపడుతున్నందున ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలియలేదని చెబుతున్నారు. ఎస్బీఐ మాజీ ఉద్యోగుల నుండి తగినన్ని దరఖాస్తులు రాకుంటే ఇతర బ్యాంకుల మాజీ ఉద్యోగులకు అవకాశమిస్తారు. కోరనా సమయంలో అందుబాటులో ఉన్న టాలెంట్‌ను ఉపయోగించుకోవాలని ఎస్బీఐ భావిస్తోందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications