ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఫిక్స్డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లను సవరించింది. సెప్టెంబర్ 10వ తేదీ నుండి ఎస్బీఐ సీనియర్ సిటిజన్లకు 5.40 శాతం, ఇతర కస్టమర్లకు 4.90 శాతానికి తగ్గించింది. రూ.2 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ పైన ఏడాది నుండి రెండేళ్ల మెచ్యూరిటీపై వడ్డీ రేట్లు తగ్గించింది.
సవరించిన రేట్లతో వారం రోజుల నుండి 45 రోజుల లోపు ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 2.9శాతానికి దిగి వచ్చింది. 46 రోజుల నుంచి 179 రోజుల డిపాజిట్స్ పైన 3.9 శాతానికి, 180 రోజుల నుంచి ఏడాది లోపు డిపాజిట్స్ పైన 4.4 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఏడాది నుండి రెండేళ్ల లోపు డిపాజిట్స్ పైన 4.9 శాతం, 2 ఏళ్ల నుండి 3 ఏళ్ల లోపు 5.1 శాతం, 3 ఏళ్ళ నుండి 5 ఏళ్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.3 శాతానికి తగ్గించింది. అయిదేళ్ల నుండి 10 ఏళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.4 శాతంగా ఉంటుంది.

సీనియర్ సిటిజన్లకు డిపాజిట్లపై వడ్డీ రేటును ఇతర కస్టమర్లతో పోలిస్తే 50 బేసిస్ పాయింట్లు ఎక్కవగా ఉంటాయి. సీనియర్ సిటిజన్లకు 7 రోజుల నుండి 45 రోజులకు వడ్డీ రేటు 3.4 శాతం, 46 రోజుల నుండి 179 రోజుల కాలపరిమితిపై 4.4 శాతానికి, 180 రోజుల నుండి ఏడాది కాలపరిమితిపై 4.9 శాతం, ఏడాది నుండి రెండేళ్ళ కాలపరిమితిపై 5.4 శాతం, రెండేళ్ల నుండి మూడేళ్ల లోపు కాలపరిమితిపై 5.6 శాతం, మూడేళ్ల నుండి ఐదేళ్ల కాలపరిమితిపై 5.8 శాతం, 5 ఏళ్ల కాలపరిమితి నుండి పదేళ్ల కాలపరిమితిపై 6.2 శాతం వడ్డీ రేట్లు వర్తిస్తాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications