ఎస్బిఐ కస్టమర్లకు గిఫ్ట్.. ఇక బ్యాంకుకు వెళ్లాల్సిన పని లేదు.. నిమిషాల్లోనే అకౌంట్..
ఎస్బిఐ కస్టమర్లకు తాజగా మరిన్ని కొత్త సేవలను తీసుకొచ్చింది. దింతో ఇప్పుడు ఇండియన్స్ విదేశాల్లో ఉన్న బ్యాంక్ సావుకార్యాలను పొందవచ్చు. అయితే ఇందుకు కొన్ని గైడ్ లైన్ జారీ చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) NRE (నాన్-రెసిడెంట్ ఇండియన్) అండ్ NRO (నాన్-రెసిడెంట్ ఆర్డినరీ) కస్టమర్ల కోసం అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ ఈజీ చేసింది. దింతో NRIల కోసం ట్యాబ్ బేస్డ్ ఎండ్-టు-ఎండ్ డిజిటల్ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ ప్రారంభించింది. ఈ విషయాన్ని బ్యాంకు ఒక ప్రెస్ నోట్ ద్వారా తెలియజేసింది.
ఈ యాప్ ద్వారా మీరు అకౌంట్ తెరవవచ్చు
ట్యాబ్ ఆధారిత బ్యాంకింగ్ సౌకర్యం అంటే బ్యాంకుకు వెళ్లకుండానే అకౌంట్ తెరవడం. 2023 సంవత్సరంలో SBI ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ స్టార్ట్ చేసింది, దీని వల్ల ఇండియా కాకుండా ఇతర ప్రదేశాల్లో నివసిస్తున్న భారతీయులు మొబైల్ అప్లికేషన్ YONO ద్వారా సేవింగ్స్ అండ్ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఈ కొత్త ట్యాబ్ ఆధారిత ఫెసిలిటీ కింద మీరు పాన్, ఆధార్ వంటి వాటితో బ్యాంకుకు వెళ్లవలసిన అవసరం లేదు, కస్టమర్‌లు డాక్యుమెంట్‌లను ఇంట్లో కూర్చొనే డిజిటల్‌గా వెరిఫై చేయవచ్చు, అలాగే వాటిని సబ్మిట్ చేయవచ్చు ఇంకా అకౌంట్ కూడా వెంటనే ఓపెన్ చేయవచ్చు. దీనికి కూడా చాల తక్కువ సమయం పడుతుంది.

SBI వెబ్‌సైట్ ప్రకారం, ఒక NRI తనకు కావాలంటే భారతీయ కరెన్సీ లేదా విదేశీ కరెన్సీలో అకౌంట్ తెరవవచ్చు. మీరు కరెంట్ అకౌంట్ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో భారతీయ కరెన్సీలో అకౌంట్ తెరవవచ్చు. అయితే మీరు డాలర్, యూరో, పౌండ్, యెన్, ఆస్ట్రేలియన్ డాలర్ వంటి విదేశీ కరెన్సీలలో ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
యోనో యాప్ ద్వారా అకౌంట్ తెరవడం ఎలా
*ముందుగా YONO యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి
*ఓపెన్ సేవింగ్స్ అకౌంట్ పై క్లిక్ చేసి, తరువాత ఓపెన్ NRE/NRO అకౌంట్ అప్షన్ క్లిక్ చేయండి
*దీని తర్వాత దేశం పేరు, మొబైల్ నంబర్‌ను ISD కోడ్, ఇమెయిల్ IDతో టైప్ చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
*ఇప్పుడు OTP వెరిఫికేషన్ కి వెళ్లి మొబైల్‌కి వచ్చిన OTPని ఎంటర్ చేయండి.
*దీని తర్వాత మీరు ఇచ్చిన డేటాను కన్ఫర్మ్ చేయాలి.
*అకౌంట్- NRE/NRO
*టైప్- సేవింగ్స్/కరెంట్
*స్టేటస్ టైప్- NRI/ PIO & ఇప్పుడు నెక్స్ట్ పై క్లిక్ చేయండి
*ఇప్పుడు స్క్రీన్‌పై ఉన్న సమాచారాన్ని చదివి నెక్స్ట్ నొక్కాలి
*ఇప్పుడు భారతదేశానికి వెళ్లి అకౌంట్ ఓపెన్ చేయాలి/కొరియర్ ద్వారా డాకుమెంట్స్ GNCకి పంపాలి ఈ అప్షన్స్ లో దేనినైనా సెలెక్ట్ చేసుకోండి.
*ఇప్పుడు వ్యక్తిగత వివరాలు, పాస్‌పోర్ట్ ఇంకా వీసా వివరాలు, మీ పెర్మనెంట్, లోకల్ అడ్రస్ ఎంటర్ చేయండి
*ఇప్పుడు మీ విద్యార్హత, నామిని, వృత్తి, మతం-కులం మొదలైనవి ఎంటర్ చేయాలి.
*చివరగా, 'నిబంధనలు & షరతులు' ఆమోదించడానికి మీ వివరాలను మళ్లీ ఒకసారి చూస్కోండి అండ్ ఇప్పుడు OTPని ఎంటర్ చేయాలి.
*ఈ స్టెప్స్ పూర్తి చేసిన తర్వాత NRI అకౌంట్ కోసం మీ అప్లికేషన్ విజయవంతంగా పూర్తవుతుంది.


Click it and Unblock the Notifications