ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(BSBD) ఖాతాదారులకు షాక్. బేసిక్ సేవింగ్స్ అంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్ కలిగి ఉన్న వారి నుండి జూలై 1వ తేదీ నుండి కొత్త సర్వీస్ ఛార్జీలు వసూలు చేయనుంది. నగదు ఉపసంహరణ, చెక్‌బుక్ పైన పరిమితులు విధించింది. ఆ పరిధి దాటితో ఛార్జీ వసూలు చేస్తామని తెలిపింది. అడిషనల్ వ్యాల్యూ యాడెడ్ సర్వీస్ జూలై 1, 2021 నుండి అమలులోకి వస్తుందని వెల్లడించింది.

4సార్లకు మించి తీస్తే వాత
SBIకి చెందిన ఏదైనా బ్రాంచీ, ఏటీఎంలో మొత్తం నాలుగుసార్లు మాత్రమే ఉచిత నగదు ఉపసంహరణకు అనుమతి ఉంది. నాలుగుసార్లకు మించి తీసుకోవాలనుకుంటే ప్రతిసారి రూ.15తో పాటు జీఎస్టీ అదనంగా చెల్లించాలి. ఇతర బ్యాంకుకు చెందిన ఏటీఎం నుండి నగదు తీసుకున్నా ఇదే తరహా ఛార్జీలు వర్తిస్తాయి. ఇకపై ఎస్బీఐ, ఎస్బీఐ-యేతర ఏటీఎంలు, ఎస్బీఐ బ్రాంచీలో కలిపి ఒక నెలలో 4సార్లు మాత్రమే డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది.

చెక్కుబుక్కు పైన
ఒక ఫైనాన్షియల్ ఏడాదిలో మొదటి పది చెక్కు లీవ్స్ ఉచితం. ఆ తర్వాత 10 లీఫ్ చెక్కు బుక్ అయితే రూ.40తో పాటు జీఎస్టీ అదనం. 25 లీఫ్ చెక్కు బుక్ అయితే రూ.75తో పాటు జీఎస్టీ అదనం. ఎమర్జెన్సీ చెక్కు బుక్ అయితే 10 లీఫ్స్‌కు రూ.50తో పాటు జీఎస్టీ అదనంగా చెల్లించాలి. అయితే సీనియర్ సిటిజన్లకు ఇవి వర్తించవు.

ఇవి ఉచితం
బ్రాంచీ ఛానల్, ఏటీఎం, సీడీఎం నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అయితే BSBD అకౌంట్ హోల్డర్లకు ఉచితం. ఎస్బీఐ లేదా ఇతర బ్యాంకుల్లో ఇది ఉచితం. ట్రాన్సుఫర్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉచితం.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications