SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్..
గురువారం కోటక్ మహీంద్రా బ్యాంకు స్టాక్ దాదాపు 10 శాతం పడిపోయింది. అయితే ఈ స్టాక్ పెట్టుబడిదారులనే కాకుండా మ్యూచువల్ ఫండ్లను కూడా దెబ్బతీసింది. ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్‌ల జారీ ఆపాలని ఆర్బీఐ ఆదేశించడంతో బ్యాంక్ స్టాక్ పడిపోయింది. ఫలితంగా మ్యూచువల్ ఫండ్స్ రూ. 4,281 కోట్ల నష్టపోయాయి. మార్చి 2023 నాటికి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో దాదాపు 7.52 కోట్ల షేర్లు ఉన్నాయి. వాటి విలువ రూ. 13,855 కోట్ల నుంచి రూ. 12,600 కోట్లకు తగ్గింది.
రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయింది. యూటీఐ మ్యూచువల్ ఫండ్, హెచ్ డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్లు కూడా నష్టపోయాయి. యుటీఐ రూ.486 కోట్లు నష్టపోగా.. హెచ్‌డిఎఫ్‌సి ఎంఎఫ్ రూ.462 కోట్లు, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్ రూ.461 కోట్లు నష్టపోయాయి. మార్చి నాటికి 36 మ్యూచువల్ ఫండ్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ లో వాటాను కలిగి ఉన్నాయి.

మ్యూచువల్ ఫండ్లు కోటక్ మహీంద్రా బ్యాంకులో మొత్తంగా దాదాపు 25.63 కోట్ల షేర్లను కలిగి ఉన్నాయి. వీటి విలువ రూ. 47,229 కోట్లకు పైగా ఉన్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్ 10 శాతం క్షీణించిన తర్వాత పెట్టుబడిదారుల సంపద రూ. 35,200 కోట్లకు పైగా క్షీణించింది. ఆర్బీఐ నిర్ణయం కోటక్ మహీంద్రా బ్యాంకుకు గట్టి దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. దీని వల్ల బ్యాంక్ వృద్ధి, నికర వడ్డీ మార్జిన్ (NIM) మరియు ఫీజు ఆదాయం ప్రభావితం అయ్యే అవకాశం ఉంది.
అదానీపై హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత కూడా కూడా పెట్టుబడిదారులు తీవ్రంగా నష్టపోయారు.ముఖ్యంగా ఎల్ఐసీ తీవ్రంగా నష్టపోయింది. ఆ తర్వాత అదానీ స్టాక్ ల్లో రికవరీ తర్వాత నష్టాలు కవర్ అయ్యాయి. కోటక్ మహీంద్రా బ్యాంకులో కొద్ది రోజుల పాటు ప్రెషన్ ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతకాకుండా బ్యాంకులో ఆర్బీఐ ఆడిట్ నిర్వహించనుంది. దీని తర్వాత స్టాక్ పై ఒక అంచనాకు రావొచ్చని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications