SBI AMC: జూన్ లో ఎస్బీఐ ఏఎంసీ కొన్న స్టాక్స్.. అమ్మిన స్టాక్స్ ఇవే..
దేశంలో అతిపెద్ది మ్యూచువల్ ఫండ్ ఏఎంసీ ఎస్బీఐ ఏఎంసీ. జూన్ 2024 నాటికి మొత్తం ఎస్బీఐ ఏఎంసీ ఏఎంయూ రూ. 10.39 లక్షల కోట్లకు చేరింది. ఇది 118 మ్యూచువల్ ఫండ్ పథకాలను నిర్వహిస్తుంది. ప్రైమ్ డేటాబేస్ విడుదల చేసిన నెలవారీ డేటా ప్రకారం జూన్‌లో ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ కొన్ని స్టాక్స్ ను కొనుగోలు చేసింది. కొన్ని స్టాక్స్ ను విక్రయించింది. ఫండ్ హౌస్ జిందాల్ స్టెయిన్‌లెస్, గోద్రెజ్ ఇండస్ట్రీస్, జస్ట్ డయల్, ICICI సెక్యూరిటీస్, టీవీ18 బ్రాడ్‌కాస్ట్, జేఎమ్ ఫైనాన్షియల్, క్రిసిల్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిట్స్, బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్, డీసీఎం శ్రీరామ్, హిందుస్థాన్ జింక్, హ్యాపీయెస్ట్ వంటి 407 స్టాక్‌లలో తన హోల్డింగ్‌లను పెంచుకుంది.
ఈ ఫండ్ హౌస్ అంబుజా సిమెంట్, సిమెన్స్, ఎస్బీఐ కార్డ్స్ & పేమెంట్ సర్వీసెస్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, శ్రీ సిమెంట్, వోల్టాస్, హెచ్యూఎల్, ఏబీబీ ఇండియా, జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్, జొమాటో, పీవీఆర్ ఐనాక్స్, IREDA సహా 120 స్టాక్‌లలో తన హోల్డింగ్‌లను తగ్గించుకుంది.

ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ దాని పోర్ట్‌ఫోలియోకు 6 స్టాక్‌లను జోడించింది, ఇందులో స్టాన్లీ లైఫ్‌స్టైల్స్, లే ట్రావెన్యూస్ టెక్నాలజీ, AMI ఆర్గానిక్స్, సన్సెరా ఇంజనీరింగ్, గాబ్రియేల్ ఇండియా మరియు అలికాన్ కాస్టాలోయ్ ఉన్నాయి. అతిపెద్ద ఫండ్ హౌస్ IREDA, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ల్యాండ్ & అసెట్స్ మరియు స్వరాజ్ ఇంజిన్స్ అనే మూడు స్టాక్‌ల నుంచ పూర్తిగా నిష్క్రమించింది.
ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో దాదాపు ఐదు ప్రత్యేకమైన స్టాక్‌లు ఉన్నాయి. అవి ఆషియానా హౌసింగ్, గాయత్రీ బయోఆర్గానిక్స్, జీకే డబ్ల్యూ , మన్పసంద్ బెవరేజెస్ మరియు రాజ్‌రతన్ గ్లోబల్ వైర్ స్టాక్స్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications